Home జాతీయ వార్తలు ‘నిర్భయ్’ క్షిపణి ప్రయోగం సక్సెస్

‘నిర్భయ్’ క్షిపణి ప్రయోగం సక్సెస్

rocket

బాలాసోర్: ఒడిశాలోని చాందీపూర్ నుంచి దేశీయంగ రూపొందించి, అభివృద్ధి చేసిన సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ‘నిర్భయ్’ ని మంగళవారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. సుదూర లక్ష్యాలను ఛేదించే ౩౦౦ కిలోల సామర్థం గల పేలుడు పదార్థాలను తీసుకెళ్లనుంది. గతంలో దేశీయంగ రూపొందించి, ప్రయోగించిన నాలుగు క్షిపణులలో ఒకటి విజయవంతమైందని రక్షణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐదో క్షిపణిని లోపరహితంగా రూపొందించి, ప్రయోగించినట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రయోగానికి ముందు ఆధునాతన క్షిపణి పేలుడు వంటి ప్రారంభ క్లిష్టమైన కార్యకలాపాలు విజయవంతం కావడంతో ఇది సాధ్యమైందని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) శాస్త్రవేత్తలు తెలిపారు. వివరణాత్మక అంచనా కోసం ట్రాకింగ్ వ్యవస్థ నుంచి దత్తాంశాన్ని తిరిగి పొంది విశ్లేషించనున్నట్లు తెలిపారు. నిర్భయ్ క్షిపణి నిర్దేశించిన లక్ష్యాలను చేరుతుందని సీనియర్ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.