Home రాష్ట్ర వార్తలు వచ్చే ఖరీఫ్‌లో నీరిచ్చే ప్రాజెక్టులకు  బడ్జెట్‌లో ప్రాధాన్యం

వచ్చే ఖరీఫ్‌లో నీరిచ్చే ప్రాజెక్టులకు  బడ్జెట్‌లో ప్రాధాన్యం

harishఇరిగేషన్ శాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : వచ్చే ఖరీఫ్‌లో నీరివ్వగలిగే ప్రాజెక్టులకే బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సాగునీటి శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశిం చారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. చీఫ్ ఇంజినీర్ల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అవసరాలకు అనుగుణంగా, ప్రాధా న్యతలను గుర్తించి ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేసేందుకు వీలుగా, వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీం నగర్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడానికి నిధులు ప్రతిపాదించాలని సం బంధిత సిఇలకు సూచించారు. కొత్తగా నిర్మాణమ వుతున్న పాలమూరు రంగారెడ్డి, నల్లగొండ జిల్లా లోని డిండి ఎత్తిపోతల పథకం, కరీంనగర్ జిల్లా లోని కాళేశ్వరం బ్యారేజీలకు, ఆదిలాబాద్ జిల్లా లోని తుమ్మిడిహట్టి, చనాక కొరాటా బ్యారేజీలకు, సదర్‌మాట్ బ్యారేజీకి, బాసర చెక్‌డ్యాం, కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపో తల పథకానికి, వివిధ జిల్లాల్లో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నిర్మించే ఎత్తిపోతల పథకాలు, భూగర్భజలాల అభివృద్ధి శాఖ పథకాలకు కేటాయించే నిధులపై సవివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నాన్ ప్లాన్ బడ్జెట్ వ్య యాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. బడ్జెట్ ప్రతిపా దనలకు తుది రూపం ఇవ్వడానికి ఈ నెల 20న మరోమారు సమావేశం కావా లని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసా గర్‌రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఇఎన్‌సిలు మురళీధర్, విజయప్రకాష్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.