Home ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

adilabadఅధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌టౌన్: నిర్మల్ నియోజక వర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొ న్నారు. సోమవారం ఆర్‌డిఒ సమావేశ మందిరంలో నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్ నియోజకవర్గానికి వందలాది కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. అధికారులు దృష్టి సారించి నియోజకవర్గంలో సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే ఏవైనా సమస్యలు పరిష్కరించకపోతే వారిపై చర్యలు తీసు కుంటామన్నారు. నియోజకవర్గానికి ఏఏఅభివృద్ధి పనులు కావాలో తన దృష్టికి తీసుకరావాలని, ప్రభు త్వానికి విన్నవించి పనులు చేపట్టేలా చర్యలు తీసు కుంటానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, మార్కెట్‌కమిటీ ఛైర్మన్ దేవేం దర్‌రెడ్డి, ఎఫ్‌ఎసిఎస్ ఛైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, మైనార్టీలు పాల్గొన్నారు.
రంజాన్‌లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
రంజాన్ మాసంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్‌డిఓ సమావేశ మందిరంలో రంజాన్ పండుగపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ మైనార్టీ సోదరులు ఉపవాస దీక్ష విడిసిన చేపడుతారని కరెంట్ కోతలు లేకుండా చూడా లన్నారు. అలాగే విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, మార్కెట్‌కమిటీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌ఎసిఎస్ ఛైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, మైనార్టీలు పాల్గొన్నారు.