Home నిర్మల్ నూతన సంవత్సరంలో నిర్మల్ అభివృద్ధి

నూతన సంవత్సరంలో నిర్మల్ అభివృద్ధి

Indra-Karan-Reddy

నిర్మల్ టౌన్: జిల్లాల విభజనలో నిర్మల్ నూతన జిల్లా గా ఏర్పాడిన సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో జిల్లా అభి వృద్దికి అధికారులు బాటలు వేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాల యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. దీనికి ముఖ్య అథితిగా హజరైన మంత్రి ఐకే జిల్లా కలెక్టర్ ఇల్లంబరిదితో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించాలని సూచించారు. నూతన జిల్లా అభివృద్దికి అన్ని శాఖ అధికారులు తమ సహయ సహకా రాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ శివలింగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.