Home జాతీయ వార్తలు ఏ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ లేదు: కేంద్రం

ఏ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ లేదు: కేంద్రం

 

న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న వైసిపి నేతలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదాపై సోమవారం లోకసభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎపి, తెలంగాణ సహా 7 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయని ఆమె తెలిపారు. ప్రణాళిక మద్దతు కోసమే ‘హోదా’కు గతంలో ఎన్‌డీసీ (జాతీయ అభివృద్ధి మండలి) సిఫార్సు చేసేదని.. పారిశ్రామిక రాయితీలతో సంబంధం లేదని నిర్మలా సీతారామన్ వివరించారు.

nirmala sitharaman Speaks about Special status