Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ..!

Nithin-Pathఓవైపు హీరోగా… మరోవైపు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రెచ్చిపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఇన్నాళ్లూ నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌ను అతని సోదరి నిఖితారెడ్డి చూసుకునేది. కానీ ఇప్పుడు స్వయంగా నితినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే అఖిల్ సినిమాకు నిర్మాతగా నితిన్ వ్యవహరిస్తున్నాడు. దీనికి తోడు తాను హీరోగా నటిస్తున్న సినిమాలకు కూడా ఇకపై తన పేరే నిర్మాతగా వేసుకోనున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా డిస్ట్రిబ్యూటర్‌గానూ దుమ్మురేపుతున్నాడు నితిన్. సూర్య హీరోగా విక్రమ్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘24’ సినిమా నైజాం రైట్స్‌ను గ్లోబల్ మూవీ మేకర్స్‌తో కలిసి సంయు క్తంగా కొన్నాడు నితిన్. ఇదే విషయాన్ని అతను ట్విట్టర్‌లో వెల్లడించాడు. గతంలో విక్రమ్ కుమార్‌తో ‘ఇష్క్’ సినిమా చేశాడు నితిన్. ఆ పరిచయంతోనే సూర్య సినిమాను భారీ రేటుకు కొనుక్కున్నాడు ఈ యంగ్ హీరో.

Comments

comments