Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ హక్కులు నితిన్‌కు..!

Gautami-Putra-Nitinహైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం కోసం బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి నైజం డిస్ట్రిబ్యూషన్ హక్కులను హీరో నితిన్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకుడు క్రిష్‌కు నితిన్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి క్రిష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు నితిన్, కలిసి సందడి చేద్దాం’ అని ట్వీట్ చేశారు.

Comments

comments