Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నితిన్‌తో సంపత్ నంది చిత్రం?

Nitinఇటీవల ‘గౌతమ్ నంద’ వంటి స్టయిలిష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు సంపత్ నంది. సినిమా సక్సెస్ అయి మేకింగ్‌పరంగా బాగుందన్న పేరు వచ్చింది. సంపత్ నంది నెక్స్ ప్రాజెక్ట్‌లో నితిన్ హీరోగా ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గౌతమ్ నంద కథను ముందుగా నితిన్‌కే చెప్పాడు సంపత్ నంది. కానీ అది నితిన్‌కు నచ్చలేదు. ప్రస్తుతం సొంత బ్యానర్‌పై సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమా తరువాత నిర్మాత రాధామోహన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. సంపత్ నందితో ‘బెంగాల్ టైగర్’ వంటి హిట్ సినిమాను నిర్మించాడు రాధామోహన్. అందుకే మళ్లీ సంపత్‌నంది-రాధామోహన్ కాంబినేషన్ వార్తల్లోకి వచ్చింది. నితిన్‌కు మరో లైన్ తయారుచేసి ఉంచాడట సంపత్‌నంది. అది కనుక ఓకే అయితే నిర్మాతగా వ్యవహరించడానికి రాధామోహన్ సిద్ధంగా ఉన్నాడు. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ వస్తుంది.

Comments

comments