Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

‘గ్రామజ్యోతి’కి నీతి ఆయోగ్ నిధులు!

neetiaayog-funds-to-gramajyమన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ల ‘గ్రామ ప్రణాళిక’ను ఆగస్టు నెలాఖరులోపు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్షంగా నిర్ణయించింది. వివిధ రంగాలు, శాఖల వారిగా రూపొందించిన గ్రామ ప్రణాళికను నీతి ఆయోగ్‌కు అందజేయనుంది. తద్వారా రాష్ట్రానికి సుమా రు రూ.580 కోట్ల నిధులను రాబట్టాలని ప్రణాళికను రచిస్తోంది. ఐదేళ్ల పాటు గ్రామాల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, గ్రామాభి వృద్ధికి తీసుకుంటున్న చర్యలపై గ్రామ సభలో చర్చించి ఆ ప్రణాళికలను రూపొందించను న్నారు. ప్రధానంగా వ్యవసాయం, వైద్యం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, రహదారులు, పారి శుధ్యం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వను న్నారు. ఐదేళ్ల కాలంలో సుమారు రూ.73వేల కోట్లతో పనులు చేపడుతు

న్నట్లు ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి తెలియజేసింది. అయితే ఇందులో ఇదివరకే వివిధ పథకాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. వాటర్‌గ్రిడ్‌కు రూ.25,000 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.25,000 కోట్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ కార్యక్రమా ల నిమిత్తం రూ. 11,400 కోట్లు కేటాయించింది. ఇలా వివిధ కార్యక్రమాల నిమిత్తం మొత్తంగా సుమారు రూ. 73,000 కోట్ల వరకు గ్రామాలలో ఖర్చు చేయను న్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదేళ్ల కాలపరిమితిలో రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ప్రతి సంవత్సరం రూ. 50లక్షల నుంచి కోటి
రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు అంచనా వేశాయి. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలి? ఏ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిం చాలి? అనేది గ్రామ ప్రణాళిక ఆధారంగా కేటా యించను న్నారు. గ్రామ ప్రణాళిలను సంపూ ర్ణంగా, సక్ర మంగా క్షేత్ర స్థాయిలో అమలు చేసిన గ్రామాల కు ప్రభు త్వం ప్రోత్సాహకా లను కూడా అందజేయాలని నిర్ణయించి నట్లు సమాచా రం. ఈ ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లు కేటా యించింది. ఈ నిధులను వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమా లకు ఖర్చు చేయనున్నారు. గ్రామ జ్యోతి కార్య క్రమం క్షేత్రస్థాయిలో సఫ లీకృతం కావాలని, అందుకు జిల్లా
యంత్రాం గంతోపాటు మంత్రులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టా లని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు.
నీతిఅయోగ్‌కు ‘గ్రామప్రణాళిక’
గ్రామ సభలు రూపొందించిన ఐదేళ్ల ‘గ్రామ ప్రణాళిక’ లను ప్రభుత్వం నీతిఅయోగ్‌కు అంద జేయనున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికను నీతి ఆయోగ్‌కు అందజేస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ల రూపంలో రూ. 580 కోట్లు కేటా యించే అవకాశాలు ఉన్నాయని అధి కార వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ్రగ్రామ ప్రణాళి కను నీతిఅయోగ్‌కు అందజేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. గ్రామపంచాయతీల నుంచి అందిన ప్రణా ళికలను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 30లోపు నీతిఆయోగ్‌కు గ్రామ ప్రణాళికల నివేదికను అందజేయాలని నిర్ణయించారు.

Comments

comments