Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నితిన్-హను కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నాం

hyperరామ్, రాశీఖన్నా హీరోహీరోయిన్‌లుగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చింది. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ “రామ్ కెరీర్‌లోనే విడుదలైన  తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్‌లను సాధించిన చిత్రంగా ‘హైపర్’ నిలిచింది. నిజాయితీగా బ్రతికే తండ్రి… నిజాయితీగా ఉండడానికి తండ్రికి సహకరించే కొడుకు కథే ఇది. నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో సత్యరాజ్… కొడుకుగా రామ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. గ్లామరస్ పాత్రలో రాశీఖన్నా అందరినీ అలరిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హైపర్’… ఈ దసరా సీజన్‌లోనూ మంచి కలెక్షన్లను సాధిస్తుందన్న నమ్మకముంది.  మా నెక్స్ మూవీని హీరో నితిన్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా 90 శాతం షూటింగ్ విదేశాలలో ఉంటుంది. రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. యూరప్‌లో చెయ్యాలా, యుఎస్‌లో చేయ్యాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. నవంబర్ ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్  మొదలవుతుంది. ఏప్రిల్‌లో షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం”అని అన్నారు.

Comments

comments