Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పోలవరం చేరుకున్న నితిన్‌ గడ్కరీ…

ga

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజమహేంద్ర వరం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాఫ్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు బయల్దేరి వెళ్లారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన పోలవరం పనులను పరిశీలిస్తున్నారు. పోలవరం పనుల తీరుపపై కాంట్రాక్ట్ ఏజెన్సీలతో పాటు అధికారులతో గడ్కరీ చర్చలు జరపనున్నారు. దాదాపు 10 నెలల తర్వాత నితన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనులను సందర్శిస్తున్నారు. అయితే మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లాలని చూసిన బిజెపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తమకు అనుమతివ్వాలని వారు ఆందోళనకు దిగారు. కేవలం పాస్‌లు ఉన్నవారినే పంపుతామని పోలీసులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి బిజెపి కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

Comments

comments