Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మొదలైన నితిన్-హను రాఘవపూడి సినిమా

nitinనితిన్ హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను వెంకట్ బోయనపల్లి సమర్పిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ నివ్వగా… ప్రముఖ నిర్మాత, నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నితిన్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకుడు హను రాఘవపూడికి అందించారు. నవంబర్ ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సమ్మర్ ప్రారంభంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. నితిన్‌తో తొలిసారి కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఆకట్టుకునే చక్కని ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః యువరాజ్, సంగీతంః విశాల్ చంద్రశేఖర్, లైన్ ప్రొడ్యూసర్‌ః హరీష్ కట్టా.

Comments

comments