Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ చిత్రం ప్రారంభం

nitinస్టార్ హీరో పవన్‌కల్యాణ్,  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పంపిణీదారుడు, నిర్మాత సుధాకర్ రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ హీరోగా పవన్‌కళ్యాన్ క్రియేటివ్ వర్క్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ప్రముఖ పాటల రచయిత కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. తొలిసారి పవన్‌కళ్యాణ్ తన బ్యానర్‌పై తాను హీరోగా కాకుండా మరో హీరో నితిన్ కోసం నిర్మాతగా మారడం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కథను సమకూర్చడం మరో హైలైట్. ఇంతటి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ట్ మూవీస్ సంస్థ కార్యాలయంలో బుధవారం  ఉదయం జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు పవన్‌కళ్యాణ్ క్లాప్‌నివ్వగా… త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.నటరాజ సుబ్రమణ్యన్, ఆర్ట్: రామకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణచైతన్య.

Comments

comments