Home తాజా వార్తలు ఎన్టీఆర్ ప్రశంసించడంతో హ్యాపీగా ఉంది

ఎన్టీఆర్ ప్రశంసించడంతో హ్యాపీగా ఉంది

కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక నివేదా థామస్‌తో ఇంటర్వూ విశేషాలు…
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో…
మిస్టరీ ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌కు ఓ కల తరచుగా వస్తుంటుంది. ఈ క్రమంలో కొత్త విషయాలు తెలుస్తాయి. మళ్లీ మళ్లీ వస్తున్న ఆ కల వల్ల ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం. ఈ కథలో చాలా అంశాలుంటాయి.
తెరపై చూడాల్సిందే…
కలలో వచ్చిన సంఘటనల ఆధారంగా దర్శకుడు గుహన్ ఈ కథ రాశారు. ఒక్క సిట్టింగ్‌లోనే నేను ఈ కథను ఓకే చేశాను. సినిమాలో నా పాత్ర చివరి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక నా పాత్ర ఏమిటనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
అద్భుతంగా తెరకెక్కించారు…
నా పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ నన్ను ప్రశంసించడంతో హ్యాపీగా ఉంది. ఇక కళ్యాణ్‌రామ్ చాలా బాగా నటించారు. దర్శకుడు గుహన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
వరుసగా సినిమాలు చేస్తా…
ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పాను. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను. ‘జై లవ కుశ’ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఇకనుంచి వరుసగా సినిమాలు చేస్తాను. నటిగా మరింత పేరు తెచ్చే పాత్రలు చేయాలనుకుంటున్నాను.
నాకు నేనే పోటీ…
చిత్ర పరిశ్రమలో నాకు ఎవరీ పోటీ కాదు. నాకు నేనే పోటీ. నాకు పాత్ర నిడివి ముఖ్యం కాదు. నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటాను. ఏ తరహా పాత్రలైనా చేస్తాను.
తదుపరి చిత్రాలు…
శ్రీవిష్ణు హీరోగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో నటిస్తున్నాను. కామెడీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. మొదటిసారిగా ఇందులో కామెడీ రోల్ చేస్తున్నాను. నిఖిల్‌తో నటించే ‘శ్వాస’ చిత్రం మార్చిలో ప్రారంభమవుతుంది. ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగుతుంది. అదేవిధంగా తమిళంలో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.

Niveda thomas Special Interview