Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ధాన్య సేకరణలో ముందున్న నిజామాబాద్

 Nizamabad in front of grain procurement

మనతెలంగాణ/ నిజామాబాద్‌బ్యూరో: నిర్దేశించిన లక్ష్యాన్ని మించి వరిధాన్య సేకరణ జరిగే అవకాశాలున్నాయని సివిల్ సఫ్లయ్ కార్పొరేషన్ డి.ఎం హరికృష్ణ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటికే 2 లక్షల 10వేల మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, నిజామాబాద్ జిల్లాకు ఈ ఏడాది యాసంగి సీజన్‌కు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్షాన్ని నిర్దేశించగా ఈ మే రకు కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 260 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాల్సి ఉండగా ఇప్పటికీ 247 కేంద్రాలను ఏర్పాటు చేశామని కొన్ని చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం రాక కేంద్రాలు పనిచేయడం లేదన్నారు. ఈ సీజన్‌లో గంగాకావేరి సన్నరకం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ఎప్పటికప్పుడు రైతులకు మద్దతు ధరను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నామని చెప్పారు. గ్రేడ్ ఏ రకానికి 1590, కామన్ వెరైటికి క్విం టాలుకు రూ. 1550 చొప్పున మద్దతు ధరను చెల్లిస్తున్నామని, ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో మద్దతు ధరను చెల్లిస్తున్నామని చెప్పారు.కడ్తా పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ను సం దర్శించినప్పుడు జాయింట్ కలెక్టర్ రవీంధర్‌రెడ్డి హె చ్చరించిన ఫలితంగా కాస్త మెరుగైన ఫలితాలు వచ్చా యి.

మిల్లర్లు కడ్తా పేరుతో రైతులు తెచ్చిన ధా న్యంతో కోతపెడితే సహించేదిలేదని జాయింట్ కలెక్టర్ పలుమార్లు హెచ్చరించారు. రైతులు కూడా ధాన్యాన్ని శు భ్రంగా తీసుకురావాలని, తాలు, చెత్తతో తీసుకురావ డం వలన మిల్లర్లు అదును చూసి కడ్తా పేరుతో ధా న్యం తూకంలో కోత విధిస్తారని, అలా కోత విధించిన పక్షంలో తమకు ఫిర్యాదు చేయాలని కొనుగోలు కేం ద్రాలను పర్యవేక్షించినప్పుడు రైతులను జెసి రవీంధర్‌రెడ్డి పదేపదే కోరడంతో రైతులు స్పందించి ఆ విధంగా నే ధాన్యం తీసుకువచ్చారు. కాగా ప్రతిరోజు 10 నుండి 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరుగుతుండ గా మరో మూడు వారాల్లో ధాన్యసేకరణ ముగుస్తుంది. సీజను ప్రారంభంలోనే ధాన్య సేకరణకు కావాల్సిన 70లక్షల గన్నీ బ్యాగులను అధికార యంత్రాంగం సేకరించి పెట్టింది. ఇంకా అవసరమైతే 10లక్షల గన్నీ బ్యా గులను ఇతర ప్రాంతాల నుండి తెప్పించేందుకు యం త్రాంగం సిద్ధ్దంగా ఉంది. వాతావరణం మార్పుల కనుగుణంగా ముందు జాగ్రత్త చర్యగా రైతులకు టా ర్పాలిన్ కవర్లు అందజేయడం జరిగిందని ఇప్పటి వ రకు అకాల వర్షాల వలన ఏలాంటి ఇబ్బందులు తలెత్తలేద ని, ధాన్యం తడిచే పరిస్థితి రాలేదని అధికారులు తెలిపా రు. వచ్చే సీజన్ నుంచి సిద్దిపేట జిల్లాలో ఏర్పా టు చేసి న మాదిరిగా ప్యాడీ క్లీనింగ్ యంత్రాలను ఏర్పా టు చే యాలని ప్రతిపాదించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

comments