Home అంతర్జాతీయ వార్తలు సౌదీలో నవీపేట వాసి మృతి

సౌదీలో నవీపేట వాసి మృతి

Man

 

మన తెలంగాణ/ నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన షేక్ యాసీన్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు కుటుంబ స భ్యులు తెలపారు. గత ఆరు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీలోని నజరాన్‌కు వెళ్లిన యాసిన్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉపాధి కో సం వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సుభాష్‌నగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రభుత్వం మ్రుతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు త్వరితగతిన అప్పజెప్పే విధంగా చేయాలని స్థానికులు కోరుతున్నా రు. మృతుడికి భార్య కౌసర్, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.

 

Nizamabad Local Man Dead in Saudi Arabia