Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రముఖులకు ‘గ్రీన్ ఛాలెంజ్’ విసిరిన కవిత

MP-KAVITHA-IMAGE

హైదరబాద్: పచ్చదనం కోసం తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. మొక్కనాటుతూ.. ఫొటో దిగారు. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ డిప్యూటి సిఎం మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరుతూ… మొక్కలు నాటాలని ఆమె పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత హరితహారం శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Comments

comments