Home నిజామాబాద్ కెసిఆర్ సర్కార్‌లో ముస్లింలకు ఒరిగిందేమీ లేదు

కెసిఆర్ సర్కార్‌లో ముస్లింలకు ఒరిగిందేమీ లేదు

shabbir-aliమన తెలంగాణ/ఇందూరు: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారని, వాస్తవంగా ఏమీ జరగడం లేదని, ముస్లింలకు టిఆర్‌ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని పార్టీ శాసన మండలి కాంగ్రెస్ సభాపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి మైనార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ స్పీకర్ కెఆర్ సురేశ్ రెడ్డి, మాజీ చీఫ్‌విప్ ఈరవత్రి అనీల్ కుమార్, డీసీసీ అద్యక్షుడు గడుగు గంగాధర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అరుణ తార, నరాల రత్నాకర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుమేర్ అహ్మద్, స్టేట్ మైనార్టీ చైర్మన్ ఖాజా ఫక్రుద్దీన్, జిల్లా ఇన్‌చార్జ్ నిరంజన్, ఇర్ఫాన్‌అలీ, ఫయాజుద్దీన్, మజీబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.