Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎటిఎం అంటే ‘ఎనీ టైం మూసివేత’గా మారింది

ఎటిఎం అంటే ‘ఎనీ టైం మూసివేత’గా మారింది

ATM

బ్యాంకుల ఎదుట నో క్యాష్ బోర్డులు
పని చేయని ఎటిఎం కేంద్రాలు
రూపాయలు పది నాణేలతో ఇబ్బందులు

ఆసిఫాబాద్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు చేపట్టడంతో సామన్య, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఇబ్బందులు కోనసాగుతునే ఉన్నాయి. ప్రతిరోజు బ్యాంకుల వద్ద నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, జమా ఇతర లావాదేవీలకు క్యూలన్లు కట్టాల్సి వస్తుంది. ప్రజలకు సరైన సమాచారం అవగాహన లేనిచో ఖాతాదారుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు మొదట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయలతో పెద్ద సంఖ్యలో బ్యాంకుల ఎదుట క్యూలన్లు కట్టిన ప్రజలు రోజుకో నిబంధనలతో బ్యాంకుల్లో గంటలగంటల తరబడి పడికాపులు కాయల్సి వస్తుంది. బ్యాంకుల్లో ఖాతాదారుల నగదు జమా ఉన్నప్పటికి నగదు తీసుకున్నమనుకున్న ఖాతాదారులకు బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు ఒక్కోసారి దర్శనం ఇస్తున్నాయి.

డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడంలో సంబంధిత అధి కారులు విఫలం అయ్యారనే విమర్శలు వేలువాడుతున్నాయి. గిరిజన గ్రామ ప్రజలకు ఇంకా బ్యాంకు ఖాతాలు ఏటీఎం లేనివారు చాలా మంది ఉన్నట్లు తేలుస్తుంది. గంటల తరబడి బ్యాంకుల్లో క్యూలన్లు కట్టాలేక అత్యవసర పరిస్దితిలో ఎటీఎం కేంద్రాల నుండి నగదు తీసుకోవాలని వేళితే అవి పని చేయకుండా ఉత్సవా విగ్రహలుగా దర్శనమి స్తున్నాయి. కోన్ని ఎటిఎంలలో బ్యాంకు అధికారులు నగదు ఉంచినప్పటికి అవి క్షణంలోనే కాలిఅయ్యే పరిస్ధితి తలేత్తు తున్నాయి. జిల్లాలో అన్ని మండలాలో బ్యాంకు కష్టాలు ఇలానే ఉంటున్నాయి.

రోజురోజుకు ఆర్‌బిఐ కోత్త నిబంధనలు అమలు చేయడంతో ప్రజల వద్ద ఉన్న  నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు రావడం లేదు దీనితో నగదు కోరత ఏర్పాడుతున్నట్లుగా కష్టంవుతుంది. ఒక్కో వ్యక్తికి వారంలో 24,000నుండి50,000వేల రూపాయాల వరకు తీసుకునేందుకు వీలు కల్పించినప్పటికి నగదు కోరతతో బ్యాంకు,తపాలా కార్యాలయా అధికారులు ఇవ్వడం లేదు ఒక వైపు నగదు కోరత మరో వైపు కొత్తగా వచ్చిన 2వేల నోటుతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇటీవల బ్యాం కుల్లో ఇస్తున్న పదినాణలతో ప్రజలు తలలు పట్టుకుం టున్నారు. రూ10 బిల్లలను తీసుకునేందెకు వ్యాపారాలు సైతం  నిరాకరించడంతో ఇబ్బందులు తలేత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నగదు,ఎటిఎంల కష్టాలు ఎప్పుడు తీరుతాయేనని ప్రజలు అయేమయంలో ఉన్నారు.