Home రంగారెడ్డి నో చేంజ్.. కలెక్టరేట్ ఇక్కడే

నో చేంజ్.. కలెక్టరేట్ ఇక్కడే

కొత్త కలెక్టరేట్ నిర్మించేవరకు లక్డీకాపూల్‌లోనే ?
శాఖలన్నీ ఇక్కడికే తరలిస్తున్న అధికారులు

COLLECTOR

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త జిల్లాల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంను శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఏర్పాటు చేస్తారని భావించిన ప్రస్తుతానికి జిల్లా యంత్రాంగం అలాంటి చర్యలను విరమించుకున్నట్లు కనిపిస్తుంది. రాజేంద్రనగర్‌లోని వెటర్నరి కళాశాలతో పాటు ఆదిబట్లలోని పలు ప్రైవేట్ సంస్థల క్యాంపస్‌లను పరిశీలించింది. జిల్లా ఎమ్మెల్యేల మద్య తాత్కలిక కలెక్టరేట్ ఏర్పాటు విషయంలో ఎకాభిప్రాయం రాకపోవడంతో ప్రభుత్వ పెద్దలు లకడికపూల్‌లోనే రెండు నెలల పాటు కొనసాగించి అనంతరం ఇక్కడ ప్రజలకు అనుగుణంగా మార్చడానికి ప్రణాళికలు సిద్దం చేశారు. అందులో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మేడ్చల్, వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయాలకు సంబందించి సామాగ్రీ, ఫైళ్ళను పంపించివేశారు. కాని ప్రస్తుతం ఇక్కడ నుంచి తాత్కలికంగా కలెక్టరేట్‌ను తరలించడం వలన కలుగు లాభనష్టాలను అంచన వేసిన జిల్లా యంత్రాంగంలోని పెద్దలు అలాంటి అలోచనను పూర్తిగా విరమించుకున్నట్లు సమాచారం. తాత్కలికంగా ఏర్పాటు చేసిన వికారాబాద్, మేడ్చల్ కలెక్టరేట్‌లో సౌకర్యాలు లేక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులతో పాటు ప్రజల నుంచి వస్తున్న పిర్యాదులను పరిగణలోనికి తీసుకున్న యంత్రాంగం శాశ్వత భవనంను నిర్మించే వరకు ఇక్కడ నుంచి పాలన వ్యవహరాలు నిర్వహించడానికి ఆసక్తీ కనబరుస్తుంది. జిల్లాలోని ఉద్యోగులు సైతం ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు. నగరం మద్యలో అందరికి అనుగుణంగా కలెక్టరేట్ ఉండటంతో ప్రజలకు సైతం పెద్దగా ఇబ్బందులు లేకుండా పోయాయి. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు శాశ్వత కలెక్టరేట్‌ను ఔటర్ శివార్లలో నిర్మించాలని తలపెట్టిన తమ ప్రాంతాల్లోనే కలెక్టరేట్‌లు ఏర్పాటు చేయాలని నేతల పట్టుపడుతుండటంతో ఇప్పటివరకు భూ పరిశీలనలకు పరిమితం అయింది. భూమి సేకరించి నిర్మాణాలు పూర్తి చేసేవరకు లకడికపూల్‌లోనే కలెక్టరేట్ కొనసాగించడం అంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు ఇక్కడే రంగారెడ్డి కలెక్టరేట్ ఉండటం ఖాయం అన్న భావన కనిపిస్తుంది.
కలెక్టరేట్‌లోకి కార్యాలయాలు …
కొత్త కలెక్టరేట్ నిర్మించేవరకు ప్రస్తుత భవనం నుంచి పరిపాలన వ్యవహరాలు కొనసాగించాలని దాదాపుగా నిర్ణయించిన జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు కొనసాగిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైద్రాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న జిల్లా కార్యాలయాలను ప్రస్తుతం ఒకే చోటికి తరలిస్తున్నారు. అందులో భాగంగా గతంలో వివిధ ప్రాంతాలలో ఉన్న జిల్లా కార్యాలయాలు గత కొన్ని రోజులుగా కలెక్టరేట్‌కు తరలిస్తున్నారు. కలెక్టరేట్‌ను శివార్లకు మార్చే అలోచన ప్రభుత్వంకు ఉన్న పక్షంలో వివిధ కార్యాలయాలను ఇక్కడికి తరలించే వారు కాదని నేరుగా అక్కడికి మాత్రమే తరలించేవారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ఉద్యానవన, మైనార్టీ సంక్షేమ శాఖ, వయోజన విద్య డిప్యూటి డైరెక్టర్, భూగర్బజల శాఖ, పరిశ్రమల శాఖ కార్యాలయాలను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌లోకి తీసుకువచ్చారు. త్వరలో మహిళ శిశు సంక్షేమం, మత్సశాఖ, జిల్లా ట్రెజరీ, అడిట్, ఏడి డ్రగ్స్ తదితర విభాగాలను కూడ లకడికపూల్‌లోని కలెక్టరేట్ భవనంలోకి తీసుకురావడానికి చర్యలు పూర్తి చేశారు. జిల్లా కార్యాలయాల కోసం గతంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో వెతికిన జిల్లా ప్రజలు ప్రస్తుతం కార్యాలయాలు అన్ని కలెక్టరేట్ భవనంలోనికి తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.