Search
Saturday 22 September 2018
  • :
  • :

‘కాంగ్రెస్ అవినీతే అభివృద్ధికి ఆటంకం’

నోరుజారిన నాగం 

Nagam

వేదిక : గాంధీభవన్….
సమయం : మంగళవారం ఒంటి గంట…
విషయం : మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రెస్ మీట్…
తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కొనసాగిన నాగం ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఏమి మాట్లాడుతారోనని జర్నలిస్టులు ఆసక్తి గా వింటున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నాగం జనార్దన్‌రెడ్డి ప్రెస్‌మీట్ చివర్లో తానంతట తానుగా ‘కాంగ్రెస్ అవినీతే అభివృద్ధికి ఆటంకం’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సీరియస్‌గా వార్త రాసుకుంటున్న జర్నలిస్టులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఏమి జరిగిందో నాగంకు అర్థంగాక లిప్తకాలం పాటు ఆగిపోయారు. తరువాత కొనసాగిస్తూ ‘టిఆర్‌ఎస్ అభివృద్ధే..’ అంటూ ఆయన మరోసారి తడబడ్డారు. మళ్ళీ జర్నలిస్టులు నవ్వడంతో తాను అప్పటి వరకు మాట్లాడింది తప్పు అని గమనించిన నాగం నాలుక కరుచుకున్నారు. ‘సారీ, జస్ట్ ఫ్లోలో అలా వచ్చింది. ఊరికే ఈడ (గాంధీభవన్‌లో) కాంగ్రెస్ కాం గ్రెస్ అంటుంటే ఫ్లోలో అలా వచ్చింద’ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

Comments

comments