Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మారని గిరిపుత్రుల చీకటి బతుకులు

డిజిటల్ యుగంలో దీపమే దిక్కు
కరెంట్, కనీస సౌకర్యాలు కరువు
నిర్లక్షం వహిస్తున్న అధికారులు
ఇబ్బందుల్లో గిరిపుత్రులు

                        Schedule-Tribals

భీంపూర్ : స్వాత్రంత్యం వచ్చి 69 సంవత్సరాలు గడుస్తున్న నేటికి గిరిపుత్రులకు కనీస సౌకర్యాలైన కరెంట్, రోడ్డు, విద్య, వైద్యం అందక వారి తల రాతలు మారక అధికారుల నిర్లక్షంతో అడవులో పులి ఉన్న చీకట్లో బతుకులు సాగిస్తున్నమని గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు. నూతనంగా ఏర్పడిన భీంపూర్ మండంలోని అందర్‌బంద్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్న బంద్ర, రెంగన్‌గూడ, రాజుల కొరి, ఖైరీగూడ తదితర గ్రామాలకు రోడ్డు సౌకర్యాం లేకపోయి నప్పటికీ కనీస సౌకర్యాలు కనరాక అభివృద్దికి అమాడ దూరంలో ఉ న్నాయి.

అందర్‌బంద్ నుంచి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో గిరి పుత్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఎవరై న అనారోగ్యం బారిన పడితే అంబులెన్స్ రావడానికి రోడ్డు సౌకర్యాం లేక దీన స్థితిలో ఉంది. మరి అత్యవసరం అయితే ఎడ్ల బండి పైనే అందర్‌బం ద్‌కు వచ్చి అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గిరి గ్రామాలకు మౌళిక సాదుపయాలు సమకుర్చడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని గిరిపుత్రులు వాపోతున్నారు.

అందర్‌బంద్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో త్రిఫేజ్ కరెంట్ సౌకర్యాం లేక కొన్ని గ్రామల రైతులు ఇబ్బంది పడుతుంటే అసలే కరెంట్ లేక 15 సంవత్సరాలుగా రాజీవ్‌నగర్ గ్రామ గిరిపుత్రులు చీకటీలోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు నెలల క్రితం మంజూరైన అధికారుల నిర్లక్షంతో కరెంట్ ఇప్పటి వరకు గిరి పుత్రులకు అందలేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా గిరిజనులకు కిరోసిన్ దీపాలే దిక్కుగా మారుతున్నారు. ఈవిషయం ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన పట్టించుకో వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిపుత్రుల అవస్థలను దృష్టిలో ఉంచుకోని మౌళిక సాదుపయలు కల్పించాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

కరెం ట్ లేక గత 15 సం వత్సరాలుగా చీక ట్లో బతుకుతున్నాం. కరెం టోళ్లు పట్టించుకోవడం లేదు. పలు మార్లు విన్నవించిన మాపై కనుకరిం చడం లేదు. పై అధికారులు చర్యలు తీసుకోని మా చీక టి బతుకుల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాం.
– మడావి ధర్ము పటేల్, గ్రామస్థుడు

కరెంట్ లేక రాత్రి సమయంలో చదువుకోవడానికి కష్టం అవుతోంది. దీపం వెలుతురులో చదువుకోవడం కష్టతరంగా మారుతుంది. మా పెద్దవాళ్లు చాలా సార్లు కరెంట్ విష యంలో అధికారులు, ప్రజాప్రతి నిధులకు తెలియజేసిన లాభాం లేకుం డా పోయింది. గిరిజనులపై దయా చూపి కరెంట్ సౌకర్యం కల్పించేల చూడాలి. మాకు కరెంట్ వెలుగులో చదువువోవడానికి సహకరించాలి.
– మేస్రం మమత, విద్యార్థిని

Comments

comments