Home జనగామ ప్రజా సమస్యలు ప్రతిబింబించని అసెంబ్లీ

ప్రజా సమస్యలు ప్రతిబింబించని అసెంబ్లీ

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  తక్కళ్ళపల్లి శ్రీనివాస్ రావు

CPI-Logo

జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలి సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా చట్టాలు రూపోందించే విధంగా వ్యవహరించడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖఁడిస్తు ందని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాస రావు అనారు.అప్రజా స్వామికంగా ఒక పార్టీచేత ఎన్నికైన ఎమ్మెల్యేలను లోబరచుకొని తమ పార్టీలో చేర్చుకొని, ప్రతి పక్షాలు లేకుండా చేయాలనే కుట్రతో, శాసన సభను తమ పార్టీ కార్యాలయంగా మార్చుకొవడాన్ని ప్రజలు ప్రజా స్వామిక వాదులు ఈ సడించు కున్నారని అన్నారు. బుధవారం తొర్ర సత్యం అధ్యక్ష తన జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతు జనగామ జిల్లాలో పోరాట పటిమ ఉన్నందున అన్ని గ్రామాలలో ప్రజా సమస్యల కోసం పోరాడే ఎర్రజెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

జనగామ జిల్లాలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై ప్రధానంగా మార్కేట్లో కందుల ధరలు పూర్తీగా పడిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురౌవుతున్నా అధికారులకు, పాలకు వర్గాలకు చలనం లేదని సిపిఐ జనగామా జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజా రెడ్డి అన్నారు. ఈ విషయం పై చర్చించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సహాయ కార్య దర్శి, బర్ల శ్రీరాములు, ఎం జనార్ధన్, ఇ సత్యం, ఆ కుల శ్రీనివాస్, వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.