Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్

Cinema-Theater

అదనపు కుర్చీలతో అసలు కంటే 30రూపాయలు అధికంగా వసూళ్ళు
కొత్త సినిమా వచ్చిందంటే ప్రత్యేక కుర్చీలు
కొత్త సినిమా ఆడినన్ని రోజులు సినిమా యజమానులకు పండుగే

కల్వకుర్తి: పట్టణంలో రెండు గంటల ఎంటర్ టైన్‌మెంట్ కోసం వచ్చే ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయకున్న అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. పట్టణంలో కొనసాగుతున్న మూడు సినిమా హాళ్ళలో కొత్త సినిమా వచ్చిందంటే అందరికి ఒకే టికెట్ అసలు అప్పర్ టికెట్ 40రూపాయలు ఉంటే అదనంగా 30రూపాయలు వసూలు చేస్తున్నారు. తీరా సినిమా హాల్స్‌లోకి వెళ్ళితే ఫ్యాన్లు ఉండవు, ఉన్న తిరగవు. భయటంగా ఏసి సినిమా హాల్స్ అని ప్రచారం ఉంటుంది తప్పా ఏసి దేవుడెరుగు ఫ్యాన్ గాలే దిక్కు ఉండదు. అదనపు కుర్చీలతో సినిమా హాల్ మొత్తం కిక్కిరిసి పోతుంది. నిబంధనల ప్రకారం 3తరగతులు ఉండగా 40రూపాయలది అప్పర్ క్లాస్,30 మిడిల్ క్లాస్, 10లోయర్ క్లాస్ టికెట్లు విక్రయించాలని నిబంధన ఉంది.

అయితే కొత్త సినిమా వచ్చిన్నప్పుడు ప్రభుత్వం సినిమా యజమానుల వినతుల మేరకు నియోజకవర్గంలో ఒక వారం పాటు ఉన్న ధర కంటే పది రూపాయలు అదనంగా విక్రయించుకోవచ్చని నిబంధన ఉంది. అయితే దానిని తుంగలో తొక్కి యజమానులు రెండు నుంచి మూడు వారాల దాఖ అన్ని తరగతులకు 70నుంచి 100దాఖ వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే చూడు లేకుంటే లేదని నిర్లక్షంగా సమాధానమిస్తున్నారు. సినిమా హాల్‌లో మూత్ర శాలలు అందులోకి పోవాలంటేనే భయం పుడుతుందని దుర్గంధంతో వారానికి ఒకసారి శుభ్రపరిచే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండవని, సినిమా హాల్స్‌లో విచ్చల విడిగా గుట్కాల కంపు చిరిగిపోయిన కుర్చీలు చిందర వందరగా చిత్తు కాగితాలు, చెత్తా చెదారంతో సినిహా హాల్స్ కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే సినిమా హాల్స్‌లో విక్రయించే తిను బండారాలు, కాలం చెల్లిన నాసిరకం తిను బండారాలను విక్రయిస్తే సొమ్ము చేసుకుంటున్నారు. సీతల పానియాలు భయట పది రూపాయలకు లభిస్తే అందులో 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. తిను బండారాలు పది రూపాయలకు దొరికే బిస్కెట్లు, పాప్ కన్‌లు 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇలా రెండు గంటల మనఃశాంతికి వచ్చిన ప్రేక్షకునికి డబ్బు ఇచ్చి పాపం కొన్నట్లే ఉన్నాయి. మరికొన్నిథియేటర్స్‌లో ధోమలు, బొద్దింకలు ప్రేక్షకులతో ఆటలు ఆడుకుంటాయి. దీనిపై తహాసీల్దార్‌ను వివరణ అడగగా తమకు ఫిర్యాదు అందితే పలు పర్యాయాలు తమ సిబ్బందితోతనిఖీలు చేయించామని ఏవైన పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన్నట్లు తహాసీల్దార్ తెలిపారు. పోలీస్ అధికారులు సైతం అధిక ధరలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు.

Comments

comments