ఏడాదిగా పని చేయని ఎక్స్‌రే మిషన్
ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో రూ.400 వసూలు
ఇబ్బందిపడుతున్న రోగులు
పట్టించుకోని సూపరింటెండెంట్
తక్షణమే ఎక్స్‌రే మిషన్ ఏర్పాటు చేయాలని రోగుల డిమాండ్
మన తెలంగాణ/నల్లకుంట : కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్ప త్రులను తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం ఆచరణలో అడుగు ముందుకేయడం లేదు. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన ఫీవర్ ఆస్పత్రిలో గత మూడు నెలల నుంచి ఎక్స్‌రే మిషన్ పని చేయడం లేదు. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆస్పత్రిలో ఎక్స్ రే మిషన్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఆస్పత్రికి రోజూ రోగులు 1000-1200 మందికి పైగా వైద్యం కోసం వస్తుంటారు. ఇటీవల చలి తీవ్రత పెరగడంతో తీవ్రత పెరగడంతో రోగుల సంఖ్య మరింతి పెరిగింది. ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ఆసుపత్రిలో ఎక్స్‌రే మిషన్ పనిచేయడంలేదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రధానంగా అస్తమా, టీబీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే రోగులకు ఎక్స్‌రే కోసం బయటికి పంపిస్తున్నారు. రూ.350 నుంచి రూ.400 వరకు ప్రైయివేటు డయాగ్నస్టిక్ సెంటర్లో చెల్లించాల్సి వస్తుంది. డబ్బులు చెల్లించి ఎక్సేరే దిగినా సకాలంలో అందడం లేదు. ఒక రోజు ఎక్స్‌రే రాస్తే, ఎక్స్‌రే దిగి ఫిలిమ్ తీసుకొచ్చి ఫీవర్ ఆస్పత్రిలో డాక్టర్‌కు చూపించుకోవడానికి రెండు మూడు రోజులు పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌రే పని చేయడం లేదని రోగులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేసిన సదరు అధికారి పట్టించుకోకపోవడంతోనే జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది. ఎక్స్‌రే మిషన్ మరమ్మతులు చేయిస్తే కేవలం రూ.54వేలు ఖర్చు అవుతుందని తెలిసింది. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఈ చిన్న మొత్తం చెల్లించి ఎక్స్‌రే మిషన్ మరమ్మతులు చేయాల్సిన ఆస్పత్రి అధికారులు ఇంత జాప్యం చేయడంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ మిషన్‌కు మరమ్మతులు చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా సూపరిన్టెండెంట్కు పూర్తి అధికారాలున్నాయి. ఈ అధికారి ఇటు ఫీవర్ ఆస్పత్రి సూపరింటె ండెంట్గా అటు అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ)గా అదనపు బాధ్యతలో కొనసాగుతున్నారు. సూపరింటెం డెంట్ పూర్తి సమయం డిఎంఇలో కేటాయిస్తున్నారని, దీంతో ఆస్పత్రిపై దృష్టిసా రించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్లక్షం అధికారుల కారణంగా ఇటు సర్కారుకు, అటు సిఎం కెసిఆర్‌కు చెడ్డ పేరు వస్తుందని అధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్ధాయి డిఎంఇ బాధ్యత అప్పగించి. ఫీవర్ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌ను నియమించాలని పలువురు రోగులు కోరు కుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి ప్రత్యేక దష్టి సారించి సమస్యకు పరిష్కార మార్గం వెతకాలని తక్షణమే ఎక్స్‌రే మిషన్ ఏర్పాటు చేయాలని రోగుల, వారి బంధువులు కోరుకుంటున్నారు.