Search
Friday 16 November 2018
  • :
  • :

అల్లాడుతున్న విద్యార్థులు

No Facilities in the  Girls Gurukul school in Suryapet

మన తెలంగాణ/పెన్‌పహాడ్ : రాష్ట్ర ప్రభుత్వం పెన్‌పహాడ్ మండలానికి మహాత్మా జ్యోతిరా వుపూలే బాలికల గురుకుల పాఠశాల సింగిరెడ్డిపాలెం పేరున గత సంవత్సరం 6,7,8 తరగతులలో 240 మంది విద్యా ర్థులతో ప్రారంభించారు. మండల కేంద్రంలో భవన సదు పాయం లేకపోవడంతో సూర్యాపేటలో ఎల్‌ఐసి భవనం పక్క సందులో మూడంతస్తుల భవనంలో హడా విడిగా ప్రారంభం చేశారు.
మౌలిక వసతులు కరువు
ఆహ్లాదకర వాతావరణంలో ప్రశాంతంగా చదవాల్సిన విద్యార్థులు మొదటి సంవత్సరం కావడంతో విద్యార్థులకు గాలి, వెలుతురు, ఆట స్ధలం లాంటి కనీస వసతులు లేకపోయినా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సర్దుకుపోవడం జరిగిందని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా ఇక్కడి నుండి త్వరలో మారుస్తామని చెప్పడం జరిగింది. అని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సంవత్సరం 5వ తరగతిలో 80 మంది విద్యార్థులు చేరడంతో భవనం సరిపోక విద్యా ర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం 5వ తరగతిలో 80 మంది విద్యార్థులు చేరడంతో విద్యార్థుల సం ఖ్య 320కి చేరింది. దీంట్లో క్లాసు రూములు, మరు గుదొడ్లు, స్నానపు గదులు, సరిగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు 320 మందికి 13 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో విద్యార్థులు అవస్థలు వర్ణణతీతం.

పది స్నానపు గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఉదయం 3గంటల నుండి ఐదు గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు విద్యార్థులు తీవ్ర మైన ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఆట స్థలం లేకపోవడ ంతో తమ పిల్లల నైపుణ్యాలు మరుగున పడుతున్నాయని తల్లి దం డ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు ఉపయో గించడానికి అధిక సహాయం కేటాయించాల్సి వ స్తుందని విద్యార్థులు వాపోతున్నారు.ఆటస్థలం, విద్యతో పాటు వి ద్యార్థులకు ఆటలు, వ్యాయామం అవసరే ఆటస్థలం లేక పోవడంతో తమ పిల్లల నైపుణ్యాలు మరుగునపడు తున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదులు సరిపడా లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థులకు డిజిటల్ క్లాసు రూమ్‌లోనే హాస్టల్ రూమ్‌గా ఉపయోగిస్తు న్నారు. దీని తో డిజిటల్ క్లాసులకు భంగం వాటి ల్లుతుందని విద్యా ర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ సదుపా యం సరిగా లేకపోవడంతో ప్రభుత్వం నుండి వచ్చే అనేక సదుపాయాలు తమ విద్యార్థులకు అందడం లేదని విద్యా ర్థుల తల్లి దండ్రు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్ర జా ప్రతినిధులు జోక్యం చేసుకొని త్వరలో మంచి వసతు లు న్న భవన స్థలాన్ని మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రిన్సిపల్ వివరణ
విద్యార్థులకు సరైన భవన సదుపాయం కల్పించాలని అలాగే వాతావరణంలో ఉంచాలని చాలా వరకు అనేక విధా లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన భవనం అందుబాటులో దొరకడం లేదు. బాగున్న సదుపాయం రూ ములు స రిపడా లేకపోవడంతో విద్యార్థుల కు అందాల్సిన మంచాలు, డైనిం గ్ హాల్, సదుపాయాలు, లైబ్రరీ, కంప్యూ టర్ రూమ్ ల కో సం ప్రభుత్వం నుండి అం దాల్సిన పరికరాలు రావడం లే దు, సమకూర్చడం లేదు. విద్యా ర్థు లు ఇబ్బంది పడు తున్న మాట వాస్తవమే కానీ సరైన భవనం కోసం వేచి చూస్తున్నాం.
నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పెట్టిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి మా పిల్లల సమస్యలను అర్ధం చేసుకొని పెన్‌ప హాడ్ మండల కేంద్రంలో ఆర్డీఓ పేరు మీద ఉన్న ఐదు ఎక రాల ప్రభుత్వ భూమిలో గురుకుల పక్కా భవ నం ఏర్పాటు చే యాలని కోరుతున్నాం. అదే విధంగా పక్కా భవనం నిర్మి ంచే వరకు సరిపడా వసతులున్నా భవనంలోకి మార్చా లని లేక పోతే ఆందోళన చేస్తాం. విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు
ఆటస్థలం మరుగుదొడ్లు స్నాన పుగదులు సరిపడా లేకపోవ డంతో గత సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరగడంతో సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి. మరుగుదొడ్లు ఉప యోగించడానికి గంటల కొద్ది లైన్‌లో నిలు చోవాల్సి వస్తోంది.
విద్యార్థినీ స్రవంతి, 6 తరగతి

Comments

comments