Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆత్మవిశ్వాసంతో భయం దూరం

విద్యార్థులకు ఉన్నట్టుగా  కాలేజీలో చదువుకునేటప్పుడు ఉన్న స్వేచ్ఛ ఉద్యోగంలో ఉండదు. ఉద్యోగంలో మన నిర్వహించాల్సిన బాధ్యతలు ఉంటాయి. మన శక్తి సామర్థాలు నిరంతరం నిరూపించుకుంటునే ఉండాలి. అవసరమైతే కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మన అస్తిత్వం కోల్పోకుండా ఉంటాం. ఆ విధంగా మీలోని నైపుణ్యాలు ప్రదర్శిస్తూ, పని మీద మంచి పట్టు సాధిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకని మీరు అనవసర సందేహలు, ఆలోచనలు వదిలేసి మొహమాటానికి తావు ఇవ్వకుండా నెమ్మదిగా ఒకరిద్దరితోనైనా స్నేహం పెంచుకుని పని నేర్చుకోవటం మీద దృష్టి పెట్టండి. 

confidenceనేను ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. అయితే, నాకు మొదటి నుంచి అందరితో కలవాలంటే కొంత బెరుగ్గా ఉంటుంది. నేను అందరితో సరిగ్గా మాట్లాడలేనేమో అన్న సందేహం వుంటుంది. దానివలన అందరిలో చులకన అయిపోతానేమో అన్న భయం వుంటుంది. ఇదే ఇప్పుడు నాకు ఇబ్బందిగా మారింది. నలుగురితో మాట్లాడాలంటే వెనుకంజ వేస్తూ ఆఫీసులో కలివిడిగా ఉండలేకపోతున్నాను. నాలో ఈ ప్రవర్తన మార్చుకోవాలంటే ఏం చేయాలి.
– ఆనందిని, మిర్యాలగూడ.
సాధారణంగా కొత్తగా ఆఫీసులో చేరినప్పుడు, ఆఫీసులో మనకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ల మధ్య, పెద్దగా అనుభవం లేని నేను వాళ్ళ మధ్య ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించగలనో లేదో అన్న భయం సహజంగానే ఉంటుంది. కాస్త అలవాటైన తరువాత ఈ బెరుకు పోతుందన్న వాస్తవం మీరు గ్రహించాలి. అది ఎల్లకాలం ఉండదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవటం సహజం. విద్యార్థులకు ఉన్నట్టుగా కాలేజీలో చదువుకునేటప్పుడు ఉన్న స్వేచ్ఛ ఉద్యోగంలో ఉండదు. ఉద్యోగంలో మన నిర్వహించాల్సిన బాధ్యతలు ఉంటాయి. మన శక్తి సామర్థాలు నిరంతరం నిరూపించుకుంటునే ఉండాలి. అవసరమైతే కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మన అస్తిత్వం కోల్పోకుండా ఉంటాం. ఆ విధంగా మీలోని నైపుణ్యాలు ప్రదర్శిస్తూ, పని మీద మంచి పట్టు సాధిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకని మీరు అనవసర సందేహలు, ఆలోచనలు వదిలేసి మొహమాటానికి తావు ఇవ్వకుండా నెమ్మదిగా ఒకరిద్దరితోనైనా స్నేహం పెంచుకుని పని నేర్చుకోవటం మీద దృష్టి పెట్టండి. మరో విషయం మీరు తెలుసుకోవాల్సింది, గుర్తించాల్సింది ఏమిటంటే… మీలో ఇలా కలివిడిగా ఉండలేకపోవడం ఈ కొత్త ఆఫీసులోనే ఉందా…. లేదా చిన్నప్పటి నుంచి ఇదే మనస్తత్వం కలిగి ఉన్నారా అన్నది కూడా ప్రధానాంశం.
మీలోని నైపుణ్యాలు ఉపయోగించి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవటంలో విఫలం కావడానికి ఈ బెరుకు మీకు అడ్డుగా ఉండి, మీకుగా మీరు ధైర్యం చెప్పులేకపోతున్నారా కూడా గమనించండి. మీలో ప్రవర్తనలోపం ఉంటే భయపడే మనస్తత్వం ఉంటే మార్చుకోవటానికి కౌన్సిలింగ్ తీసుకోవటం మంచిది. మానసిక నిపుణులను సంప్రదించండి. ఆత్మవిశ్వాసం పెంచుకోవటానికి, కాస్త ధైర్యంగా ఆఫీసు వాతావరణంలో ఎలా మెలగాలో నేర్చుకోవటానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులకు వెళ్లటం కూడా మంచిది.
– ఆత్మన్యూనత తగ్గించుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటే ఉద్యోగంలో బాధ్యతలు నెరవేర్చలేనేమోనన్న భయం వీడిపోతుంది. అందరితో కలివిడిగా ఉండగలరు.
– మీలోని నైపుణ్యాలను ఉపయోగించుకొని ప్రదర్శిస్తూ, కొత్త నైపుణ్యాలను పెంచుకోవటానికి ఎప్పుడు ముందు వుండాలి.
– పనితనం పెరిగి, చక్కగా బాధ్యతలు నిర్వహిస్తూవుంటే మీరే ధైర్యంగా ఉండగలుగుతారు.

Comments

comments