Home రాష్ట్ర వార్తలు పెరగని భూనీటిమట్టాలు

పెరగని భూనీటిమట్టాలు

boresహైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వందల మీటర్ల లోతున వేసిన బోర్లు, నీటి సంరక్షణ చర్యలను చేపట్టకపోవడం తదితర కారణాల రీత్యా ప్రస్తుతం భూగర్భ జలాలు దారుణంగా అడుగంటిపోతున్నాయి. గత సం వత్సరం కాన్నా ఈ సంవత్సరం భూగర్భ జలా లు మరింత అడుగంటి పోవడం రైతుల్లో తీరని ఆవేదనను కలిగిస్తున్నది. రాష్ట్రంలో 2015 జూన్ మాసంలో సగటున 12.56 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ఈ ఏడాది మే మాసంలో 15.62 మీట ర్లకు పడిపోగా జూన్ నాటికి 15.42 కు చేరు కుంది. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాల మూ లంగా భూగర్భజలం అక్కడక్కడా కొద్దిపాటిగా పెరిగినట్లు భూగర్భజల వనరుల శాఖ తన నివేదిక లో పొందుపరిచింది. రాష్ట్రంలోని సగం జిల్లాలు  మెదక్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 122 మండలాల్లో  పరిస్థితి దారుణంగా తయారై సమారు 20 మీటర్ల లోతు కు భూగర్భ జలమట్టం పడిపోయింది. మిగతా ఐదు జిల్లాల్లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదనే చెపుతున్నారు. మహబూబ్‌నగర్, అదిలా బాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌లలోని 166 మండలాల్లో 10 నుంచి 20 మీటర్ల మేర నీటిమట్టం  పడిపోయింది.  మెదక్ జిల్లాలో పరి స్థితి మరింత దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2015 జూన్ మాసంలో 21.42 మీటర్లలో నీటి లభ్యత  ఉండగా ఈ సంవత్సరం మే మాసం వచ్చేనాటికి పరిస్థితి మరింత విషమంగా తయారయి 25.52 మీటర్లకు పడిపోయింది. గత కొద్దిరోజుల వర్షాల కారణంగా జూన్ మాసం వరకు 24.64 మీటర్లకు చేరుకుంది. ఈ జిల్లా తదుపరి స్థానాన్ని నిజామాబాద్ జిల్లా ఆక్రమించిందని చెప్పాలి. గత జూన్ లో 14.54 మీటర్ల లోతున నీటి లభ్యత ఉండగా ఈ ఏడాది మే మాసం వరకు 20.24 కు పడిపోయింది. అంటే సుమారుగా ఆరు మీటర్లలోతుకు నీటి లభ్యత పడిపోయింది. ఇక జూన్ మాసాంతానికి కూడా ఈ లభ్యతలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదని 20.64 గా నమోదు అయిందని పేర్కొంటున్నారు.
ఇక రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూన్ మాసంలో 15.70 మీటర్లు ఉండగా ఈ సంవత్సరం మే మాసాంతానికి 18.20 మీటర్ల లోతుకు పడిపోయింది. జూన్ మాసాంతానికి ఇది 17.36 కు చేరిందని తెలిపారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితికి వస్తే 2015 జూన్ మాసంలో 13.61 మీటర్లు ఉండగా 2016 మే మాసాంతానికి 17.55 కు చేరుకుంది. ఇక జూన్‌లో పెద్దగా తేడా కనిపించలేదని 17.36 కు చేరుకుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో గత జూన్‌లో 11.68 మీటర్ల తో ఉండగా ఈ సంవత్సరం మే కు 15.65 కు చేరుకుంది. జూన్‌లో కొద్దిగా పెరిగి 15.85 మీటర్ల లోతుకు చేరింది.ప్రస్తుతం జూన్‌లో హైదరాబాద్ నగరంలో 10.23, ఖమ్మంలో 11.06, కరీంనగర్‌లో 13.53, అదిలాబాద్‌లో 10.72 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉందని చెపుతున్నారు.దీని మూలంగా వర్షాలు సక్రమంగా రాని పరీస్థితిలో బోరు బావుల కింద సేవ్యం కష్టంగానే ఉంటుందని రైతులు దిగాలు చెందుతున్నారు.దీనికి తోడు మరో ఐదు రోజుల పాటు అక్కడక్కడా ఒక మోస్తరు కన్నా తక్కువ వర్షపాతమే నమోదుకానుందని వాతావరణ శాఖ తెలుపుతున్నది.ఆగస్టు మాసాంతం వరకు నమోదయ్యే వర్షపాతం పైనే పంటల సాగు ఆధారపడి ఉంది.శుక్ర,శని వారాల్లో ఎగువన కురిసిన వర్షపాతం మూలంగా ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోగా తదుపరి నారాయణపూర్ కూడా నిండింది. తదుపరి శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు నిండటాన్నిబట్టి తెలంగాణలో పరీస్థితులు అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుందంటున్నారు. కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. రామగుండం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియేస్‌కు చేరుకుంది. మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తిరిగి రుతుపవనాలు ప్రభావం చూపితే గానీ పరిస్థితి ఇదమిద్దంగా చెప్పలేని దశ ఇప్పటికి నెలకొని ఉంది.