Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నో లవ్ విత్ నితిన్

Megha-Akash

హైదరాబాద్ : హీరో నితిన్‌ను తాను ప్రేమించడం లేదని నటి మేఘా ఆకాశ్ స్పష్టం చేశారు. నితిన్‌తో కలిసి ఆమె లై చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నితిన్‌తో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు. అయితే వీరి మధ్య ప్రేమ ఉందని కొంతకాలంగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే నితిన్ చిత్రం కోసం మేఘా ఆకాశ్ డేట్లను సర్దుబాటు చేసుకుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ఖండించింది. చిత్ర బృందం కోరికమేరకే తాను డేట్లు సర్దుబాటు చేసుకున్నట్టు తేల్చి చెప్పారు. అంతే తప్ప నితిన్‌తో తనకు ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం వాస్తవం కాదని తన అభిమానులు గ్రహిస్తే చాలునని ఆమె పేర్కొన్నారు.

 No Love With Nitin

Comments

comments