Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అందాల ఆరబోతకు వ్యతిరేకం : సాయి పల్లవి

SAI-PALLAVI

హైదరాబాద్ : ఫిదాలో భానుమతిగా ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా చిత్రం ఆమెకు ఎంతగానో పేరు తెచ్చింది. తాను సంప్రదాయ పద్ధతిగా ఉంటానని ఆమె చెబుతున్నారు. గ్లామర్ పేరుతో అందాల ఆరబోతకు తాను వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. స్కిన్‌షో, లిప్‌లాక్‌లకు తాను పూర్తి వ్యతిరేకమని ఆమె తేల్చి చెప్పారు. స్కిన్ షోను కొందరు గ్లామర్ అనుకుంటున్నారని, ఇదే భావనతో తన వద్దకు కొందరు వచ్చారని, అటువంటి సినిమాలకు తాను నో చెప్పానని ఆమె వెల్లడించారు. తన ముఖం మీద మొటిమలు ఉన్నా, స్క్రీన్ మీద అందంగానే కనిపిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. నిర్మాతలకు తాను ఎక్కువ కండీషన్లు పెడుతున్నట్టు ఎవరైనా అనుకుంటే తానేమీ చేయలేనని ఆమె చెప్పారు. తన దృష్టిలో కథ మాత్రమే హీరోనని, మిగిలిన వారందరూ నటులేనని ఆమె వెల్లడించారు. మంచి కథ, మంచి పాత్ర అయితేనే తాను నటిస్తానని ఆమె పేర్కొన్నారు.

No more act in Glamour Roles : Sai Pallavi

Comments

comments