Home తాజా వార్తలు మెగాస్టార్‌పై బయోపిక్ అవసరం లేదు: నాగబాబు

మెగాస్టార్‌పై బయోపిక్ అవసరం లేదు: నాగబాబు

Megastar

 

హైదరాబాద్: ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ సినిమాలు తీస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్‌టిఆర్ జీవిత చరిత్రను రెండు సినిమాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ చిత్రం విడుదలై హిట్ కొట్టింది. చిరంజీవిపై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని బ్రదర్ నాగబాబు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తరువాత చిరు జీవితం సాపీగా సాగిందని, ఎక్కడ ఒడుదొడుకులు ఎదుర్కొలేదని వెల్లడించారు. సావిత్రి, సిల్క్ స్మిత, సంజయ్‌దత్‌ల జీవితాలలో సస్పెన్షన్ ఉన్నాయి కావునా బయోపిక్‌లు వచ్చాయన్నారు. రామచరణ్ తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే బెటర్ అని నాగబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిరుపై బయోపిక్ వచ్చే అవకాశాలు లేవని సినీ వర్గాలు పేర్కొన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, లోక్ సభ ఎన్నికల ముందు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో  చిరు నటించనున్నారు.

No Need Biopic on Megastar Chiranjeevi