Search
Monday 24 September 2018
  • :
  • :

తాత్కాలిక డిజిపిలు వద్దు

శాశ్వత ప్రాతిపదికమీద నియమించిన వారిని మధ్యలో తొలగించ వద్దు
రిటైర్‌మెంట్‌కు ముందే కొత్తగా తీసుకోదగ్గ సీనియర్ల జాబితాను యుపిఎస్‌సికి పంపించాలి
అది సూచించే ముగ్గురిలో ఒకరిని నియమించుకోవాలి : సుప్రీంకోర్టు

Supreme-Court

న్యూఢిల్లీ : పోలీస్ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా పోలీసు అధికారుల నియామకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని నియమించరాదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాం తంలో డిజిపి రిటైర్‌మెంట్‌కు కొన్ని నెలల ముందుగానే సీనియర్ పోలీ సు అధికారుల పేర్లని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) కి పంపించాలని, వారి నుంచి డిజిపి లేదా పోలీస్ కమిషనర్ పదవికి అర్హులెవరో యుపిఎస్‌సి పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తెలిపింది. సీనియర్ పోలీస్ అధికారుల లిస్టుని పరిశీలించిన యుపిఎస్‌సి   దానిలో నుంచి చాలా సమర్థులైన ముగ్గురు ఆఫీసర్ల పేర్లను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతుందని చెప్పింది. ఈ ముగ్గురి నుంచి ఒకరిని డిజిపి లేదా కమిషనర్‌గా నియమించుకోవాలని ఆదేశించింది. అయితే రాష్ట్రం నియమించిన డిజిపిని నిర్దేశించిన పూర్తి కాలం పాటు కొనసాగించాలని, మధ్యలో తొలగించడానికి వీలులేదని, తమకు అనుకూలమైన వారిని నియమించుకోకూడదని ఆదేశించింది. తాత్కాలిక డిజిపిని ఎట్టి పరిస్థితిలోనూ నియమించరాదని స్పష్టం చేసింది.

Comments

comments