Home జాతీయ వార్తలు నో పాలిటిక్స్ : మహేష్‌బాబు

నో పాలిటిక్స్ : మహేష్‌బాబు

No Politics: Actor Mahesh Babu

విజయవాడ : తాను రాజకీయాల్లోకి రానని సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పష్టం చేశారు. తన జీవితకాలమంతా సినిమాల్లోనే నటిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా నటించిన ‘ భరత్ అనే నేను ’ సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడలో ఈ సినిమా విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ కోసం ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక్కడు, దూకుడు, పోకిరి వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడలోని డివి మానర్ హోటల్‌లో ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులతో కలిసి సందడి చేశారు. భరత్ అనే నేను సినిమాకు ఘన విజయం అందించిన అభిమానులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో తనను తన తండ్రి కృష్ణతో పోల్చడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

No Politics: Actor Mahesh Babu