Thursday, April 25, 2024

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవు

- Advertisement -
- Advertisement -

no power cuts in telangana says Jagadish Reddy

200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి
ప్రస్తుత సంక్షోభానికి బాధ్యత పూర్తిగా కేంద్రప్రభుత్వమే వహించాలి
జల విద్యుత్ ఉత్పత్తి బాగుంది : మంత్రి జగదీశ్‌రెడ్డి
 రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు రావు
 రాష్ట్రంలో రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి
 కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటోంది
 పూర్తి బాధ్యత కేంద్రానిదే : మంత్రి జగదీశ్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేదని, ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్‌కట్ అయ్యే అవకాశం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిన నేపథ్యంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి విలేకరులతో హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద మంగళవారం ఉదయం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు రావు, రానివ్వమన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన తెలిపారు. దేశాన్ని పాలిస్తున్న నాయకులు ఈ విషయమై కచ్చితంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్‌కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మళ్లీ హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హైడల్ పవర్ ఉత్పత్తి బాగుంది

హైడల్ పవర్ ఉత్పత్తి బాగుందని శ్రీశైలం , నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో సరిపోతుందని మంత్రి తెలిపారు. గతేడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టా రీతిన నిర్ణయాలు తీసుకోవడంతో రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉందని, దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాయవద్దు

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు వస్తాయని, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేవన్నారు. ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే ఈ బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే అది నిజమే అనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాయవద్దన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News