Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఇబ్బందుల్లేకుండా ఆసరా పింఛన్లు

ఇబ్బందుల్లేకుండా ఆసరా పింఛన్లు

మేడ్చల్ కలెక్టర్ ఎం. వి. రెడ్డి

ASARA

మన తెలంగాణ/కీసర: పెద్ద నోట్ల రద్దుతో ఆసరా లబ్దిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పింఛన్లు పంపిణీ చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నాగారంలోని పోస్టాఫీస్‌ను సందర్శించిన కలెక్టర్ ఆసరా పింఛన్ల పంపిణీని పరిశీలించారు. పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వృద్దులు, వితంతు వులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు వృద్దులకు స్వయంగా పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు వందలు, వెయ్యి రూపాలయ నోట్లు రద్దు కావడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైన ప్పటికీ సమస్యలను అధిగమించి లబ్దిదా రులకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ముందు ఎలాంటి ఇబ్బందు లకు తావులేకుండా సజావుగా పింఛన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నాగారం, దమ్మాయిగూడ గ్రామాలకు చెందిన ఆసరా పింఛన్ దారులకు నాగారంలోని పోస్టాఫీస్‌లో పింఛన్ల పంపిణీ జరుగుతుండగంతో ఇబ్బందులు ఎదురవు తున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట ఉపేందర్ రెడ్డి, ఎంపిడిఒ వినయ్‌కుమార్, సర్పంచ్ కౌకుంట్ల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.