Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు రద్దు

No Rakhi Celebrations in Raj Bhavan

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఈ ఏడాది రాఖీ వేడుకలను రద్దు చేశారు. ప్రతి యేటా రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాఖీ పండుగ వేడుకలు ఈనెల 26న జరగనున్నాయి. కేరళలో భారీ వర్షాలు కురిసి ఎంతో మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళ వరదల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలను రద్దు చేసుకున్నట్టు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఆపదలో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవాలని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No Rakhi Celebrations in Raj Bhavan

Comments

comments