Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నిర్భయ దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదు

nirbaya

న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని సోమవారం  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో మరణ శిక్ష పడ్డ ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. వారికి ఉరిశిక్షే సరైందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శిక్షను వెంటనే అమలు చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్ అశోక్ భూషన్ నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దోషుల పిటిషన్‌ను విచారించి స్ఫష్టమైన తీర్పును వెలువరించింది. 2012 డిసెంబర్ 16న దక్షిణ ఢిల్లీలో తోటి విద్యార్థితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ 13రోజుల అనంతరం ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితులు ముఖేశ్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గత ఏడాది మరణశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Comments

comments