Home తాజా వార్తలు ఆయన వస్తే… పది వేల మందితో సభ పెట్టలేదు: చిరుమర్తి

ఆయన వస్తే… పది వేల మందితో సభ పెట్టలేదు: చిరుమర్తి

Chirumarthi Lingaiah

 

హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తే పది వేల మందితో ఆ పార్టీ నాయకులు సభ పెట్టలేకపోయారని నకిరేకల్ ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశారు. గురువారం లింగయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సి, ఎస్టీలకు సముచిత స్థానం కల్పిస్తాలేరని మండిపడ్డారు.   తాను కాంగ్రెస్ పార్టీకి, తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి మళ్లీ నకిరేకల్ నుంచి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని, ఎవరీకి నమ్మక ద్రోహం చేయాల్సిన అవసరం తనకు లేదని, తన నియోజక వర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చిరుమర్తి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి సహకారం ఉందని తెలిపారు.  ప్రజలు టిఆర్ఎస్ వైపే ఉండడంతో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. 

 

No Respect on Dalit’s in Congress Party in Nalgonda