Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

రహదారులపై రక్షణ ఏది…?

No-Road-Safety

కనిపించని ప్రమాద సూచిక బోర్డులు
నిర్లక్ష్యంగా ఆర్‌అండ్‌బి శాఖ

మనతెలంగాణ/కాసిపేట : ప్రయాణంలో ఇంటినుండి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరుకుంటామా అనే సందేహంలో వాహానదారులు, ప్రయాణికులు వున్నారు. రహాదారులపై ఆర్‌అండ్‌బి శాఖ నిర్లక్ష్యం తోడుకావడంతో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగు తుందో తెలియని పరిస్థితులు నెలకొని వున్నాయినే విమర్శలు వినవ స్తున్నాయి. రహాదారులపై ప్రమాదాల జోన్లను గుర్తించి అక్కడ  ఆర్‌అండ్‌బి శాఖ రూట్లను చూపే బోర్డులతో పాటు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. మంచిర్యాల నుండి మెదలు బెల్లంపల్లి వరకు రహాదారులపై ఎన్నో ప్రమాద జోన్లు వున్నాయి. మూల మలుపులు, లింకురోడ్లు, రోడ్లను ఆనుకొని ఎడమ, కుడి వైపున పెట్రోలు బంకులు వున్నాయి. కాని కొన్ని చోట్ల తప్పా మెజారిటి స్థలాల్లో ప్రమాద సూచిక బోర్డులు లేవనే చెప్పాలి.

బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళ్లె రహాదారిలో ఇటివల  అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందిన సంఘటనలతో పాటు అనేక మంది క్షతగాత్రులుగా మారిపో యారు. ఈ రహాదారిపై నిత్యం వేలాది వాహానాలు తిరుగుచుండగా రహాదారులపై ఏలాంటి ప్రమాద, సూచికలు లేక పోవడంతో నిత్యం ఎదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతు రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల నుండి మెదలు ఎసిసి, క్యాతన్‌పల్లి క్రాస్‌రోడ్డు, బొక్కలగుట్ట కుర్మపల్లి, పులిమడుగు రామకృష్ణపూర్, మేడారం నార్లపూర్, కెకెరెండుగని, సోమగూడెం క్రాస్‌రోడ్డు, దేవాపూర్, పాతబెల్లంపల్లి క్రాస్‌రోడ్డు, బెల్లంపల్లి మైక్రోస్టేషన్, ఇరువైపుల బెల్లంపల్లి రైల్వేస్టేషన్, కాల్‌టెక్స్ అండర్‌బ్రిడ్జి, కన్నాలప్లైవర్‌బ్రిడ్జి బెల్లంపల్లివైపు  మూల మలుపులు, లింకురోడ్లు వున్నాయి ఇలాంటి ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుచున్నాయి.

అలాగే హైటెక్‌సిటి, క్యాతన్‌పల్లి, పులిమడుగు, బెల్లంపల్లి ప్రాంతాల్లో రహాదారి ప్రక్కనే పెట్రోలు బంకులు కూడా వున్నాయి. ఇక్కడ ప్రమాదాలు సూచించే బోర్డులు లేకపోవడం, వాహానాదారులు ఇష్టానూసారంగా లోపలికి, బయటకు వెళ్లె సమయంలో కూడా ప్రమాదాలు చేటు చేసు కుంటున్నాయి. ఇదిలా వుండగా వాహానాల అతివేగం, మద్యం సేవించి వాహానాలు నడపడం వల్ల కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నాయి. అంతేకాకుండా బొగ్గు టిప్పర్ల డ్రయివర్ల అతివేగం కూడా ప్రమాదాలకు కారణంగా మారుచున్నాయి. అంతే కాకుండా రోడ్ల శిథిలావస్థకు చేరడం వాటికి అడ్డదిడ్డంగా మరమ్మత్తులు చేయడంతో రోడ్డు ఎత్తుపల్లాలు కావడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురౌతున్నాయనే ఆరోపణలు వాహానదారుల నుండి వినవస్తున్నా యి.  ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి ప్రమాద స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహానాల వేగాలను కూడా నియంత్రించాలని కోరుచున్నారు.

Comments

comments