Search
Thursday 15 November 2018
  • :
  • :

కంపు కొడుతున్న కుభీర్

Kubheer

రోడ్డుపై పారుతున్న మురికినీరు
పారిశుద్ధ్య పనులు చేపట్టని పంచాయతీ అధికారులు
ఫిర్యాదులు చేసినా స్పందించని వైనం
రోగాల బారిన పడుతున్న ప్రజలు

కుభీర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఎన్నో పథకాలను ప్రవేశపేడుతున్నా గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. అందుకు నిదర్శణం మండల కేంద్రమైన కుభీర్ మేజర్ గ్రామపంచాయతిలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై మురికి పట్టి కంపు కొడుతుంది. గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తుంది. మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో దుర్గందాన్ని వెదజల్లుతూ రోడ్డుపై మురికినీరు పారుతుంది. దీంతో ఆ దుర్వాసనకు గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జీబ్ స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై మురికినీరు ప్రవహిస్తుంది. తహసిల్దార్ కార్యాలయం ముందు గత వారం రోజులుగా మురికినీరు ప్రవహిస్తుంది. మసీదు పక్కన ఉన్న మురికి కాలువలో చెత్తా చెదారం నిండుకపోవడంతో మసీదు ముందుర మురికినీరు నిలిచి దుర్గాంధాన్ని వెదజల్లుతోంది.

మురికి కాలువలు చెత్తా చెదారం నిండుకపోవడంతో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్న పంచాయితీ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా ఉంటున్నారని పలువురు అంటున్నారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ముందర చెత్త వేయ డంతో ప్రాథమిక కేంద్రానికి వచ్చే రోగులు ముక్కున వేలేసుకుని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ అధికారులు లక్షలు ఖర్చు చేస్తున్నా పారిశుద్ధ్య సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని పలు కాలనీవాసులు వాపొతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళే దారిలో నీళ్ళ కుండి వద్ద, వెటర్నరీ ఆసుపత్రి ముందర మురికి నీరు రోడ్డుపై పారుతూ దుర్వాసన వెదజల్లుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముక్కు మూసుకొని వెళ్తున్నారు.

నయాబాదిలో మురికి కాలువలు లేక పోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవాహిస్తుంది. వర్షపు నీరు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండడంతో వర్షపు నీరు ఇండ్ల ముందు మడుగులు కట్టి వాటిలో దోమలు, ఈగలు వృద్ధి చెంది రాత్రి వేలల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. మురికి కాలువలో పూడిక నిండి పోయి కాలువల్లో పందులు తిరుగడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఎశాల దత్తాత్రి చిన్న కొడుకు ప్రబల్(04), డెంగ్యు వ్యాధితో మృతి చెందాడు. చిన్నపాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు పారిశుధం పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు  చర్యలు తీసుకుంటాం: గ్రామంలో పరిశుద్ధ పనులు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గ్రా మంలో పుడికతీత పనులను కొనసాగిస్తున్నాం. మసీదు వ ద్ద సిమెంట్‌రోడ్డు వేయడం వల్ల మురికినీరు ప్రవహి స్తుందని త్వరలో ఈ సమ స్య ను పరిష్కరిస్తామని ఇం చార్జ్ ఇఒ మోహన్ సింగ్ తెలిపారు. – ఇంచార్జ్ ఇఒ మోహన్ సింగ్

Comments

comments