Home మినీ సంగ్రామం ‘మోడీ సిగ్గులేని నియంత’ : కేజ్రీవాల్

‘మోడీ సిగ్గులేని నియంత’ : కేజ్రీవాల్

Arvind-Kejriwal

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. పంజాబ్, గోవా అసెంబ్లీల ఎన్నికల పోలిం గ్ శనివారం జరగనున్న నేపథ్యంలో మోడీని ‘సిగ్గులేని నియంత’ అంటూ కేజ్రీవాల్ ఘాటు గా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయించేందుకు మోడీ ప్రయత్నిస్తు న్నాడని ఆయన అరో పించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయవలసిందిగా ఆదాయపు పన్ను శాఖ ఎన్ని కల కమిషన్‌కు సిఫార్సు చేసినట్లు వచ్చిన వార్త లను గురించి ప్రస్తావిస్తూ పంజాబ్, గోవాలలో బిజెపి ఓటమినుంచి తప్పించుకోవడానికి మోడీ వేసిన ‘చెత్త ఎత్తుగడ’ ఇదని ఆయన ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రా లలో కూడా గెలుస్తామనే ఆశతో ఆప్ ఉంది. తమ పార్టీకి రూ.27 కోట్ల కన్నా మించి వచ్చిన విరాళాలకు సంబంధించి ఆప్ తప్పుడు ఆడిట్ నివేదికలను సమర్పిం చిందనే ఆరో పణపై దానికి రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయవలసిం దిగా ఎన్నికల కమిషన్‌ను ఆదాయపు పన్ను శాఖ కోరినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి.