Home కుమ్రం భీం ఆసిఫాబాద్ స్మశాన వాటికకు స్థలం కరువు

స్మశాన వాటికకు స్థలం కరువు

ABVP

ఆసిఫాబాద్‌టౌన్: మానవ జీవితం ఎంతో విలువైనది. పొయే టప్పుడు ఎవరైనా తీసుకెళ్ళేది మంచి, చెడులు ఎన్ని ఆస్తులు , అంతస్థులు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఆరు అడుగుల జాగ కూడా వెంబడి రాదని అందరికి తెలిసిన విషయం. ఇంత కాలం బతికి ఉండి చివరి క్షణంలో వారి దహనసంస్కరాలకు ఎన్ని ఇబ్బందులో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హిందు వులకు స్మశానవాటికలు లేక ప్రజలు వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎన్నో మరి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో కుల, మతాలకు తేడా లేదు.

చివరికి అక్కడికే వెళ్ళాల్సిందే. జిల్లా కేంద్రంలో స్మశానవాటిక లేదంటే మారుమూల గ్రామాల ప్రజల బాధలు వేరే చెప్పనక్కర్లేదు. ఎవరైనా మృతి చెందితే దహనసంస్కరాలు చేపట్టేందుకు స్దానిక గొడవెల్లివాగు వద్దకు వెళ్ళి దహన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వర్షకాలంలో దహన సంస్కరాలకు ఎన్నో ఇబ్బందులు,ఆటంకాలు ఎదురు అవుతున్నాయి. ఒకవైపు వాగు ప్రవాహం,మరోవైపు సరియైన స్దలం లేక ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేక దహన సంస్కరాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని 2008 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములనైనా కోనుగోలు చేయాలని ఉత్తర్వులను సైతం ఇచ్చింది.

జిల్లా కేంద్రంలో సుమారు 13 వేల కుటుంబాలు నివాసిస్తుండగా 30 వేల వరకు జనాభాను కల్గి ఉన్నారు. అధిక శాతం జనాభాను హిందువులు కల్గి ఉన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం వైకుంఠ దామమ్ పేరుతో స్దలాలను గుర్తించి స్మశాన వాటిక నిర్మాణ పనులను చేపట్టేందుకు పథకాలను ప్రవేశపెట్టిన అది మాత్రం ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. గత కొన్ని రోజుల క్రితం స్దానిక ప్రజాప్రతినిధులు,రెవెన్యూ అధికారులు జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల స్దలాలను పరిశీలించిన ఒ కొల్కి రాలేదు.

కొన్ని చోట్ల దహన సంస్కారాలకు ఇబ్బందులు
మృతి చెందిన శవాలకు దహన సంస్కరాలను చేపట్టేందుకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. మండలంలోని ఎల్లారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో తమ స్దలం నుండి శవాలను తీసుకవెళ్ళావచ్చానని కొందరు హుకుం జారీ చేయడంతో హుటహుటినా పోలీసులు,రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేపట్టి దహన సంస్కరాలకు పంపించిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.

బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు
మెజార్టీ హిందువులకు జిల్లా కేంద్రంలో స్మశాన వాటిక కోసం స్దలం కేటాయించి అన్ని సౌకర్యాలను కల్పించాలని భారతీయ జనతాపార్టీ ఆందోళనలు,రాస్తారోకో కార్యక్రమాలను సైతం నిర్వహించారు. సబ్ కలెక్టర్,కలెక్టర్ అధికారులకు సైతం వినతిపత్రాలను అందించారు. అయినప్పటికి జిల్లా స్దాయి అధికారులు,ప్రజాప్రతి నిధులు పట్టింపు లేని తనంగా వ్యవహారించడం సర్వత్రా విమర్శాలు సైతం వస్తు న్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అధికారులు స్మశాన వాటిక కోసం స్దలం కేటాయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.