Home అంతర్జాతీయ వార్తలు తాలిబన్లతో చర్చలు ఉండవ్ : ట్రంప్

తాలిబన్లతో చర్చలు ఉండవ్ : ట్రంప్

TRUMP-2

వాషింగ్టన్ : అఫ్గాన్‌లో అమాయక ప్రజలను అతి కిరాతకంగా చంపేస్తున్న తాలిబన్లతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రజలపై తాలిబన్ల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతో వైట్‌హౌస్‌లో జరిగిన ప్రత్యేక భేటీలో ట్రంప్ మాట్లాడారు. తాలిబన్లు వారి సొంత ప్రజలనే దారుణంగా చంపేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడిలో చనిపోతున్న వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లను తుదముట్టించేందుకు యూఎస్ భద్రతా దళాలను గతంలో పెంచామని ఆయన చెప్పారు. ఇటీవల తాలిబన్లు అంబులెన్స్‌లో బాంబులు అమర్చి వందమంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనలో సుమారు 235 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని ఓ హోటల్‌పై కూడా తాలిబన్లు దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. ఈ దాడులను భారత్ కూడా ఖండించిన విషయం తెలిసిందే.

No Talks with Talibans : Trump