Search
Wednesday 26 September 2018
  • :
  • :

కెరీర్‌పై టెన్షన్ లేదు

kareenaనేటి గ్లామరస్ హీరోయిన్‌లకు  ఓ సినిమా హిట్ అయితే చాలు వరుసగా ఆఫర్స్ వచ్చిపడు తున్నాయి. ఇలా వచ్చిన ఆఫర్లను వెంటనే ఓకే చేసేసి… చకచకా సినిమాలు పూర్తిచేసి పేరు, డబ్బు సంపాదిం చేసు కుందామని అనుకుంటూ ఉంటారు కథానాయి కలు. కానీ ఇలాంటి రూటులో తాను వెళ్లనంటో ంది బాలీవుడ్  బ్యూటీ కరీనా కపూర్. విభిన్నమైన సినిమాలు చేస్తున్న తనకు సక్సెస్ రుచి ఎలా ఉంటుందో తెలుసని… అందుకే కెరీర్‌పై, ఆఫర్స్‌పై ఎలాంటి టెన్షన్‌లు లేవని చెబుతోంది కరీనా. వరుసగా సినిమాల్లో నటించాలన్న కోరిక ఏమాత్రం లేదని… సినిమాలే కాదు తనకు వేరే పనులు కూడా ఉన్నాయని అంటోంది ఈ భామ. ఇటీవల ‘కీ అండ్ కా’ మూవీలో మహిళల మనస్తత్వాన్ని, వారి ఆలోచనల్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన కరీనాకపూర్ త్వరలో ‘ఉడ్తా పంజాబ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత కరీనా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆఫర్స్ వచ్చాయో లేదో తెలియదు కానీ… వేరే ఏ చిత్రానికి సైన్ చేయలేదు. “ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ పిక్చర్ చేస్తానో, లేదో నాకు కూడా తెలియదు. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయాలనే కోరిక ఏమాత్రం లేదు. ఏడాదికి ఒకటి, రెండు మూవీస్ చేసినా చాలు. నేను ఓ స్టార్ హీరోయిన్‌గా, అమ్మగా, భార్యగా ఉంటూనే యాక్టింగ్‌ను కొనసాగిం చగలను”అని అంటోంది బెబో.

Comments

comments