Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పేదలకు అందని సర్కారు వైద్యం

మత్తు వైద్యుడు లేడని ఆపరేషన్ నిలిపివేత
145214మహబూబ్‌నగర్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సర్కారు ఆసుపత్రులను అన్ని విధాలుగా ఆధునీకరించామ ని,పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు పూర్తి స్థాయి లో అందిస్తున్నామని ఓ వైపు ఆ శాఖమంత్రి ప్రకట నలు గుప్పిస్తున్నారు.కానీ వాస్తవం మాత్రం అందు కు భిన్నంగా ఉంటుంది. తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనలు ఇ ందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. బాధితులు తెలి పిన వివరాల మేరకు కోయిలకొండ మండలం చం ద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన ఉమాదేవి తన కుమా రుడు రాజేశ్వర్‌రెడ్డికి తీవ్రమైన కడుపునొప్పితో రావ డంతో నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యులకు చూ యించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ బాలుడికి అపెండైటీస్ ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు బాలుడికి ఆపరేషన్ చేస్తామని తల్లికి వివరించారు. వరుసగా నాలుగు రోజుల పాటు బాలుడికి ఎలాంటి ఆహారం ఇవ్వవద్దని వైద్యులు సూచించారు.

తీరా శనివారం నాడు ఆపరేషన్ చేస్తామని థీయేటర్‌లోకి తీసుకెళ్లి డ్రస్సు వేసి టేబుల్‌పై పడుకోబెట్టిన తర్వాత మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేడంటూ ఆ బాలున్ని బ యటకు పంపించారు.ఇదేవిధంగా వడ్డేపల్లి మండ లం పైపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు తన కొడుకు అశోక్‌కు తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి చి కిత్స కోసం వచ్చాడు. అపెండైటీస్ ఉన్నట్లుగా గుర్తిం చి వైద్యులు మూడు రోజుల పాటు బాలుడిని ఎ లాంటి పానీయాలు తీసుకోకుండా ఉండాలని తం డ్రికి సూచించారు. మొదటి బాలుని వలే ఈ బాలు న్ని కూడా ఆపరేషన్ థీయేటర్‌లోకి తీసుకెళ్లి మత్తు వైద్యులు లేడంటూ ఆపరేషన్ చేయకుండా నిలిపి వేశారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చి న్నారుల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. మ త్తు డాక్టర్ లేనిసంగతి తమకు ముందుగానే చెప్పి ఉంటే వేరేటోట ఇప్పటకే ఆపరేషన్ చేయించేవార మనిఆ పిల్లల తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు .
జరగకుండాచూస్తాం.:ఆర్‌ఎంఓ
ఇద్దరు బాలురను నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నా మని, ఇలాంటి నిర్లక్షపు ఘటనలు మరో సారి జర గకుండాచూస్తామని ఆర్‌ఎంఓ వివరణ ఇచ్చారు.

Comments

comments