Home కుమ్రం భీం ఆసిఫాబాద్ పనులు ఘనం.. కూలీ శూన్యం

పనులు ఘనం.. కూలీ శూన్యం

Upadi hami works

ఉపాధి పనులు చేసిన పైసలు రావడం లేదు… ఎంపిడిఒ బృందానికి కూలీల ఫిర్యాదు

సిర్పూర్(యు): చేసిన పనులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలనే నిబంధన ఉన్న గ్రామీణీలు ఎంపిడివో శశికళ ఠాగూర్‌కు మెర పెట్టుకున్న ఘటన సిర్పూర్(యు) మండలంలో చోటు చేసుకుంది. గురువారం మండలంలోని పంగిడి, పుల్లర, గుట్టగూడ ప్రాంతాల్లో ఎంపిడివో బృందం పనులను పరిశీలింది. ఎంపిడివో శశికళ ఠాగూర్, ఈజీఎస్ ఏపీవో చంద్రయ్య, ఈసీ శ్రీనివాస్‌లు క్షేత్ర స్థాయి పర్యటన జరిపి కూలీలు చేపడుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు.

అయితే గుట్టగూడ గ్రామానికి చెందిన పలువురు కూలీలు మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం  చేపట్టిన పనులకు రశీదులు అందినప్పటికి వేతనాలు మాత్రం అందలేదని గురువారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 2లక్షల వేతనాలు త మకు అందాల్సి ఉందని ఈ సందర్భంగా కూలీలు మెరపెట్టుకున్నారు. ఎర్రని ఎండలో పనులు చేపట్టిన పనులు సంబందించిన రశీదులను ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని ఎంపిడివోకు మెర పెట్టుకున్నారు. ఈమేరకు ఎంపిడివో స్పందిస్తు ఘటనపై విచారణ జరిస్తామని వెంటనే డబ్బులు చెల్లించేల చర్యలు తీసుకుంటామని కూలీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో చంద్రయ్య, ఈసీ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.