Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జూ‘రాళ్లే’

జలాశయం నిండితేనే ఉమ్మడి
జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు
ఈసారైన ఉమ్మడి జిల్లాల  ప్రాజెక్టులకు నీరందేనా….?

                     Project

ధరూరు: బిర బిరా కృష్ణమ్మ పరుగులు ఆగిపోయ్యాయి… భానుడు చండప్రచండం గా నిప్పులు కురిపిస్తుండడం ప్రతిరోజు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఉమ్మ డి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా పేరుగాంచిన పెద్దన్న జూరాలా పూర్తిగా వట్టి పోయింది… నీళ్లు లేక అడుగంటిపోయింఇ…దీంతో ప్రస్తుతం తాగునీటికే కటకటగా మారింది… అయితే జూరాల కింద కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలో ప్రతి ఏటా 1.9లక్షల ఎకరాలకు సాగునీటిని ఇస్తున్నా రు… అయితే ఇపుడు ఆయకట్టు పెరిగింది. నూతనంగా ఖరీఫ్‌లో 2.53 లక్ష లకు నెట్టెంపాడు, కల్వ కుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్షా న్ని నిర్ధేశిం చింది… అయితే ప్రాజెక్టులల్లో పనులు మందకో డిగా పడుతు లేస్తూ కొనసాగుతుండడం… మరోవైపు జూరాలా ప్రాజెక్టు కూడ పూర్తిగా నీళ్లు లేక వెలవెల పోతుండడం తో ఖరీఫ్‌లో అదనంగా ఆయకట్టుకు సాగునీరు సాధ్యమే నా… అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఉమ్మడి జిల్లాల్లోని నూతన ప్రాజెక్టుల పరిస్థితి..: కాంగ్రెస్ ప్ర భుత్వ హయాంలో అప్పటి దివం గత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప నులు పుష్కకాలం గడుస్తున్నప్పటి కీ ఇంకా అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రతిఏటా ఖరీఫ్ ముందు నేతలు పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందిస్తామని చెప్పటం…. తరువాత వారి మాటలు గాలిలో కలవ డం పరిపాటిగా మారింది. అయితే ఈసారి సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు ఈఎడాది జన వరిలో సాగునీటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలన చేశారు. తప్పకుండా 2.53లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులకు లక్షాన్ని నిర్ధేశించారు.

దీంతో అధికారులు పనుల వేగవంతం కోసం చర్యలకు ఉపక్రమించారు. కాని ఇంకా చాలా చోట్ల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిలో సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌లో నెట్టెంపాడు కింద 70వేల ఎకరాలు, కల్వకుర్తి కింద 90వేల ఎకరాలు, భీమా కింద 63వేల ఎకరాలు, కోయిల్‌సాగర్ కింద 30 వేల ఎకరాలను అందించాలని లక్షాన్ని పెట్టుకుని మరీ అధికారులు పనులు చేపడుతున్నారు. వాస్తవానికి నెట్టెంపాడు పూర్తి స్థాయి ఆయకట్టు 2.2లక్షల ఎకరాలు, కల్వకుర్తి 3.42లక్షల ఎకరాలు, భీమా 2.03లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ 57వేల ఎకరాలుగా ఉంది. అంటే ప్రభుత్వం నిర్ధేశించిన ప్రస్తుత లక్షం పరిశీలిస్తే మొత్తం ఆయకట్టులో కనీసం సగానికి కూడ నీళ్లు ఇచ్చే పరిస్థితిలో లేదంటే పనులు ఎంత అధ్వన్నంగా సాగుతున్నాయో స్పష్టమవుతుంది.

వచ్చే ఎడాది ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయి…: ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నాలు గు ప్రాజెక్టుల కింద పంట కాలువలకు అవసరమైన పిల్లకాలువలు, డిస్టిబ్యూటరీ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2.53లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్షంగా పెట్టుకున్నాం. రబీనాటికి నాలుగు ప్రాజెక్టుల పరిధిలోని పనులను పూర్తి చేస్తాం. వచ్చే ఎడాది ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయి 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. అధేవిధంగా ప్రస్తుతం జూరాలా ప్రాజెక్టులో కేవలం 2.9టీఎంసీల నీరు అందు బాటులో వుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే జూరాలా ప్రాజెక్టు కింద స్థిరీకరించిన 1.9లక్షల ఎకరాలతో పాటు 2.53లక్షల ఎకరాలకు నీరివ్వటానికి సాధ్యపడుతుంది. అని ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టు సీఈ ఖగేందర్ మనతెలంగాణకు వివరించారు.

Comments

comments