Home తాజా వార్తలు వెలవెలబోతున్న పాకాల చెరువు

వెలవెలబోతున్న పాకాల చెరువు

Pakala Lake

 

మన తెలంగాణ/ఖానాపురం: తెలంగాణ రాష్ఠ్రంలోని వరంగల్ రూరల్ జిల్లాలో మంచినీటి సరస్సు పాకాల చెరువు పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పాకాలలో నీటి మట్టం తగ్గడంతో వెలవెల బోతున్నట్లు పర్యాటకులకు కనిపిస్తుంది. పాకాల చెరువు మానేరు పరివాహాక ప్రాంతంలొ ఉన్నది. చెరువు నలువైపుల అడవి విస్తరించి ఉంది. చెరువు కాలువలు 80 చదరపు మైళ్లు పరుచుకొని ఉన్నాయి. చెరువు ఎండిపోయిన సందర్భాలు లేవు చెరువు కట్టమీద శాసనం గణపతిదేవ మహారాజు కాలంలో ఆయన మంత్రి బయ్యన నాయకుడు, మాచమాంబల కుమారుడు ఆయిన జగదాలు ముమ్మడి నిర్మించినట్లు తెలుపుతున్నది. పాకాల చెరువు ఆగష్టు 2018 నెలలొ పదిహేను రోజులపాటు మత్తడిపోసింది. 30 ఫీట్ల నీటిమట్టంలో అలుగు పోయడంతొ పర్యాటకులు సందర్శించారు. నిండుకుండలాగ కనిపించిన చెరువు ఇప్పుడు నీరు అడుగంటడంతో పర్యాటకుల సందడి తగ్గింది. పాకాల చెరువు ఆయకట్టు పరిధిలోని సుమారు ఇరువై ఐదు వేల ఎకరాలు సాగు నీరు అందుతోంది. యాసంగిలో 6 వేల ఎకరాలు అధికారికంగా సాగు చేయనున్నారు. తీవ్ర ఎండలతో సుదూర ప్రాంతాల నుంచి పశువులకు తీసుకొచ్చి వాటి దాహాన్ని తీరుస్తున్నారు. రాబోయో వర్షాకాలంలొ చెరువు నీటితో నిండి రైతులకు, పర్యాటకులకు ఆనందాన్ని నింపాలని కోరుకుందాం.

 

No Water in Pakala Lake in Warangal