Home జోగులాంబ గద్వాల్ అడుగంటిన తుంగభద్ర

అడుగంటిన తుంగభద్ర

15 రోజులు దాటితే ఇక దాహపు కేక

Tungbhadra-River

రాజోళి: మండల కేంద్రమైన రాజోళి గ్రామ శివారుల్లో ఉన్నటువంటి తుంగ భద్ర నదిలో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపొతోంది. దీంతో తుంగభద్ర నది అడుగంటిపోయి 15 రోజుల్లో దాహపు కేకలు మొదలవ్వబోతున్నాయి. ఈ ఏడాది ఎన్నడులేని విధంగా మార్చి నెలలో పూర్తిగా అడుగంటిపోయో పరిస్థితి నెలకుంది. సుంకేసుల ఎగువబాగంలో నీరు లేక పురతన ఆలయం అవశేషాలు భయటపడ్డాయి. సుంకేసుల డ్యాం బ్యాక్ వాటర్ నుండి నియోజక వర్గానికి రెండు రక్షిత మంచినీటి పథకాలున్నాయి.

అయితే ఇందులో ఒకటి మరో రెండునెలల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న మంచినీటిపథకం నియోజకవర్గంలోని మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలకు త్రాగునీరు అందించే రాజోళి రక్షిత మంచినీటి పథకం మరో పక్షం రోజుల్లో నీరు లేని కారణంగా తీవ్ర నీటి ఎద్దడి మొదలైయ్యో అవకాశాలు ఏర్పడబోతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటేనే నీటి ఎద్దడి నివారించవచ్చు. ఎగువనున్న టిబి డ్యాంలో సైతం నీరు అడుగంటిపోవడంతో ఈ సారీ త్రాగడానికి గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సివస్తోంది.