Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కైలాష్ సత్యార్థి ‘నోబెల్’ చోరీ

Kailash-Satyarthi

న్యూఢిల్లీ: సామాజికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలో ఆయన ఉంటున్న ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీలో నోబెల్ శాంతి బహుమతి జ్ఞాపికతో పాటు ప్రశంసపత్రాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చిన్న పిల్లల హక్కుల కోసం కైలాష్ సత్య పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించారు. కైలాష్ సత్యార్థి సామాజిక సేవకు గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదే ఏడాది కైలాష్‌తో పాటు పాక్ సాహస బాలిక మాలాలాకు కూడా నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే.

Comments

comments